PPM: రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మన్యం జిల్లా అసిస్టెంట్ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష ఆధ్వర్యంలో సోమవారం అంతరాష్ట్ర దాడులు నిర్వహించారు. దాడుల్లో 8400 లీటర్ల బెల్లపు ఊట,100 లీటర్ల నాటుసారా, 540 కిలోల నల్ల బెల్లం ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆనంతరం నిర్వాహకులపై కేసులు నమోదు చేశామని చెప్పారు. దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు.
సత్యసాయి: డీఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో 227 మంది గ్రామ సంఘ సహాయకులకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. మడకశిర, అగళి, గుడిబండ, అమరాపురం, రోళ్ల మండలాలకు చెందిన సిబ్బందికి వీటిని అందజేశారు. పరిపాలనలో డిజిటల్ సాంకేతికతను భాగం చేస్తూ మహిళా సాధికారతను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.
WG: ఆకివీడు పెదపేట రామాలయ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని కోరుతూ దళిత, ప్రజా సంఘాల నేతలు సోమవారం కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలిశారు. మాజీ MLA దిగుపాటి రాజగోపాల్ నేతృత్వంలో KVPS, CITU, బహుజన జేఏసీ ప్రతినిధులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కె.క్రాంతిబాబు, బి.వాసుదేవరావు, డి.వి.సాగర్, జుత్తిగ నరసింహా మూర్తి పాల్గొన్నారు.
ASR: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు డా.నాగమానస అధికారులను ఆదేశించారు. సోమవారం పాడేరు కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. పాఠశాల మధ్యలోనే చదువు మానేసిన విద్యార్థులను పాఠశాలలో చేరేలా ప్రోత్సహించాలన్నారు. పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావం నుంచి దూరంగా ఉంచేలా అవగాహన కల్పించాలన్నారు.
చిత్తూరు సబ్‌డివిజన్ డీఎస్పీ వెంకటనారాయణ పూతలపట్టు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులను సమీక్షించి సిబ్బందికి కీలక సూచనలు చేశారు. హైవేలపై ట్రాఫిక్ నియంత్రణ, మద్యం సేవించి డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాద ప్రాంతాలను గుర్తించి వెంటనే స్పందించాలన్నారు.
SKLM: ఉపాధి హామీ పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను రెండు రోజుల్లో వేతన దారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు జిల్లా డ్వామా PD జి.వి. లవ రాజు సోమవారం ప్రకటనలో తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల గత కొన్ని రోజులుగా ఆగిన పేమెంట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తామని తెలిపారు.
VZM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, TDP అధినేత నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవం సందర్భంగా ఎల్.కోటలో వేడుకలు మిన్నంటాయి. సోమవారం క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఆనంతరం కార్యకర్తల సమక్షంలో కేకు కోశారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
ATP: గుత్తి మున్సిపాలిటీ అప్ గ్రేడ్ అయ్యింది. జనాభా, ఆదాయం ఆధారంగా థర్డ్ గ్రేడ్ నుంచి సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిందని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మీయా తెలిపారు. అప్ గ్రేడ్ కావడం వల్ల ఎక్కువ నిధులతో పాటు అదనపు సిబ్బంది వస్తారని, మున్సిపాలిటీ అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుందన్నారు.
కోనసీమ: సఖినేటిపల్లి(M)లోని 5 ఆలయాల్లో హుండీలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు SI దుర్గా శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. భీమవరానికి చెందిన ధనుశ్, చలపాక ప్రవీణ్‌లను రాజోలు కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుల వద్ద నుంచి రూ.11,022 నగదు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. జైలుకు తరలించినట్లు తెలిపారు.
BPT: జూనియర్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో జిల్లా కొత్త మైలురాయిని చేరుకుంది. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రకారం 387 పాఠశాలలు, 60 కళాశాలల నుంచి మొత్తం 1,06,007 మంది విద్యార్థులు సభ్యులయ్యారు. ఈ విజయంతో డీఈవో శ్రీనివాస్ సింగ్‌ను సత్కరించారు. ప్రతి నెల 30న రిటైర్డ్ ఉద్యోగులను గౌరవించే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
W.G: తాడేపల్లిగూడెంలోని 8, 14, 24 వార్డుల ప్రభుత్వ వసతి గృహాలను మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసు బాబు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం, పరిశుభ్రమైన తాగునీరు అందించాలని ఆదేశించారు. భోజనం నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల కల్పనలో ఎటువంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సత్యసాయి: కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న నాయి బ్రాహ్మణ కుటుంబాలకు అండగా ఉంటామని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి హామీ ఇచ్చారు. కదిరిలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ఆయనను కలిసి, బ్రాండెడ్ సెలూన్ల పోటీతో తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరించారు. ఆధునికత పేరుతో చిన్న వ్యాపారులు నష్టపోవడం సరికాదని ఆయన అన్నారు.
AKP: పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులు 138 మందికి పాఠ్యపుస్తకాలను సోమవారం ప్రిన్సిపల్ మరియు డీఐఈఓ మద్దిలి వినోద్ బాబు పంపిణీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే సిద్ధం కావడానికి జిల్లాలో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
VZM: నిబంధనలకు విరుద్ధంగా అధిక పెన్షన్ పొందుతున్న ముగ్గురు విశ్రాంత ఉద్యోగులపై బొబ్బిలి సబ్ ట్రెజరీ అదికారి పద్మనాభం సోమవారం పోలీసులకు పిర్యాదు చేసారు. ఇటీవల జరిగి ఆడిట్‌లో ఈ అక్రమం వెలుగుచూడటంతో,పెన్షన్ సొమ్మును తిరిగి చెల్లించాలని STO అధికారులు నోటీసులు ఇచ్చినా వారు స్పందించకపోవడంతో ఆయన పోలీసులకు పిర్యాదు చేసారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.
అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని MPUP ఉర్దూ స్కూల్ విద్యార్థుల తాగునీటి సమస్యకు సోమవారం శాశ్వత పరిష్కారం లభించింది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి 3,4వ వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, దాపేదర్‌పల్లి MPP స్కూల్‌లో రూ.5 లక్షలతో కొత్త బోరు, మోటార్ ఏర్పాటు చేయించి నీటి సమస్యను తీర్చారు. మంత్రి స్కూల్‌కు స్థలం, ఆర్వో ప్లాంట్, కెమెరాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.