విశాఖలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ ట్రస్ట్ ఆవిర్భవించిందని ఛైర్మన్ వడ్డాది ఉదయకుమార్ తెలిపారు. శనివారం సుజాతనగర్ ట్రస్ట్ కార్యలయంలో మాట్లాడుతూ బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి, సామాజిక భద్రత లక్ష్యంగా ట్రస్ట్ పనిచేస్తుందన్నారు. అర్చకులు, పురోహితుల సమస్యల పరిష్కారానికి సహకరిస్తామని చెప్పారు. సభ్యత్వానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
KDP: కమలాపురంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై వైసీపీ నిరసన తెలిపింది. పార్టీ సమన్వయకర్త నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో శనివారం స్థానిక వెంకటేశ్వరస్వామి గుడిలో టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు. అక్రమ సంబంధాలతో తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న బీఆర్ నాయుడును ప్రభుత్వం తక్షణమే బర్తరఫ్ చేయాలని నరేన్ డిమాండ్ చేశారు.
VZM: మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సోదరుడు తమ్మన్నశెట్టి గత కొద్దిరోజుల క్రితం స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే. రంగారావు (బేబీ నాయన) శనివారం విజయనగరంలోని వారి స్వగృహమందు కోలగట్ల సోదరులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
GNTR: వట్టిచెరుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జేసీ తనిఖీ చేశారు. వైద్యం నిమిత్తం వచ్చిన ప్రజలతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు పట్ల ఆరా తీశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి సిబ్బంది పనితీరును, శుభ్రత, మంచినీరు, మరుగుదొడ్లు వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసర మందులు అందుబాటు ఏ మేరకు ఉన్నాయో తనిఖీ చేశారు.
KRNL: గ్రామ అభివృద్ధి కోసం ఇంటి, కుళాయి, వాణిజ్య పన్నులను సకాలంలో చెల్లించాలని దేవనకొండ గ్రామ కార్యదర్శి రాముడు యాదవ్ ఇవాళ కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు పన్నుల వసూలు కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఆలస్యం చేయకుండా బకాయిలు వెంటనే చెల్లించి గ్రామ పురోగతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి శనివారం వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
PLD: వినుకొండ పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపై నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశం శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లుగా జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మల్లికార్జునరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు అంశాలపై అధికారులతో చర్చించారు.
NDL: మహానంది మండలం తిమ్మాపురంలో ఏపీ మోడల్ స్కూల్లో ఏప్రిల్ 2, 4వ తేదీలలో క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాలను ప్రిన్సిపల్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. క్రీడల విభాగంలో విద్యార్థులు శారీరక దృఢత్వాన్ని, క్రీడా స్ఫూర్తిని చాటగా, సాంస్కృతిక విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరిని అలరించాయి. శనివారం కార్యక్రమం ముగింపులో పోటీల్లో బహుమతులు అందజేశారు.
VZM: వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సీపీఐ నెల్లిమర్ల మండల కార్యదర్శి పాపారావు అన్నారు. నెల్లిమర్లలో శనివారం ఆయన మాట్లాడుతూ.. సామాన్య ప్రజలతో పాటు చిరు వ్యాపారులు తమ జీవనం గడపడం కష్టతరంగా మారిందని, ఇటు గ్యాస్ దొరక్క అటు కట్టెలు కొనుక్కోలేక అనేక కుటుంబాల్లో పస్తులు ఉంటున్నారన్నారు.
ఏలూరు రూరల్ మండలం కోమడ వోలు గ్రామంలో వివాహిత ఇవాళ ఆత్మహత్యకు పాల్పడింది. అరవల్లి నాగమణి (44) భర్త, పిల్లలతో కలిసి జీవిస్తుంది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలు నేపథ్యంలోని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. రూరల్ ఎస్సై జయ శర్మ ఐపీఎస్ అనుమానాస్పదగా మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరుతూ ఈనెల 10 నుంచి 12 వరకు అనంతపురం జిల్లాలో జరుగుతున్న సీపీఐ, బీకెఎంయూల ఆధ్వర్యంలో పాదయాత్రను జయప్రదం చేయవలసిందిగా సీపీఐ నేతలు కోరారు. శనివారం ఏలూరు ప్రజా సంఘాల కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
AKP: ఎలమంచిలి మున్సిపాలిటీలో ఆస్తి, ఖాళీ స్థలాల పన్నుల బకాయిలను ఒకేసారి చెల్లించిన వారికి 50 శాతం వడ్డీ రాయితీ గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు. అవకాశాన్ని పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత నెల 30వ తేదీ వరకు ఇచ్చిన గడువును పొడిగించిన విషయాన్ని ప్రజలు గమనించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
E.G: ఉండ్రాజవరం గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ శనివారం అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
VSP: 2025-26 ఆర్థిక సంవత్సరంలో విశాఖ, విజయవాడ రైల్వే డివిజన్లు తమ పనితీరుతో ఆకట్టుకున్నాయి. సరుకు రవాణాలో విశాఖ డివిజన్ 85.10 మిలియన్ టన్నులతో ముందంజలో నిలిచింది. స్థూల ఆదాయంలో కూడా రూ.10,422 కోట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు విజయవాడ డివిజన్ 40.63 మిలియన్ టన్నుల సరుకు రవాణా, రూ.5,907 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
SKLM: శనివారం టెక్కలి నియోజకవర్గంలో MLC దువ్వాడ శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నందిగాం మండలం, టెక్కలి మండలం, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లో మరణించిన కుటుంబ సభ్యులను కలుసుకుని పరామర్శించారు. అనంతరం కోటబొమ్మాళిలో చింతల సింహాద్రి కుమార్తె మరణించగా రూ.20,000 ఆర్థిక సహాయం అందజేసి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.