• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అలర్ట్: కలెక్టర్

SKLM: జిల్లాలో ఏప్రిల్ 23 నుంచి  వడగాల్పులు తీవ్రమయ్యే అవకాశం ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఓప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, రాజాం, ఆముదాలవలస సహా పలు మండలాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

April 23, 2026 / 08:05 AM IST

లాం ఫామ్‌లో వ్యవసాయ సలహా మండలి సమావేశాలు

పల్నాడు జిల్లా లాం ఫామ్‌లో ఏప్రిల్ 24, 25 తేదీలలో వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశాలు జరగనున్నాయి. రైతులు హాజరై కొత్త రకాలు, యాజమాన్య పద్ధతులు, కీటక నియంత్రణపై అవగాహన పెంపొందించుకోవాలని అధికారులు సూచించారు. దీంతో సాగులో లాభదాయక ఆదాయం సాధ్యమని తెలిపారు.

April 23, 2026 / 08:05 AM IST

నేటి నుంచి బ్రహ్మంగారి మఠంలో ఆరాధన మహోత్సవాలు

KDP: పోతులూరు వీరబ్రహ్మేం ద్రస్వామి ఆరాధన గురుపూజా మహోత్సవాలు ఇవాళ్టి నుంచి 28వ తేదీ వరకు నిర్వహి స్తున్నట్లు మఠాధిపతి వీరధర్మజ వేంకటాద్రి స్వామి, మఠం మేనేజర్ ఈశ్వరయ్య తెలిపారు. ఉదయం సుప్రభాతంతో ప్రారంభమై నామసంకీర్తనం, అభిషేకాల అనంతరం భక్తులకు శేషవాహనంపై స్వామి దర్శనమిస్తారని వివరించారు.

April 23, 2026 / 08:04 AM IST

నేడు పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన

KKD: ఎమ్మెల్సీ, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గురువారం పిఠాపురంలో పర్యటించనున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు తెలిపారు. పిఠాపురం మండలం కుమారపురంలోని హోటల్ గోకులం గ్రాండ్‌లో ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు కార్యకర్తలు, నాయకులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లతో మాటామంతీ కార్యక్రమం నిర్వహిస్తారని వివరించారు.

April 23, 2026 / 08:03 AM IST

‘అనంతబాబు కేసులో నిజాలు బయటకు రావాలి’

E.G: ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో పూర్తి నిజాలు బయటపెట్టాలని షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ డిమాండ్ చేశారు. గోకవరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతూ, ఘటనను ప్రమాదంగా చూపించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. కేసులో సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

April 23, 2026 / 08:00 AM IST

నెల్లూరులో పోలీసుల భారీ తనిఖీలు

నెల్లూరులోని కోటమిట్ట జంక్షన్ పరిధిలో బుధవారం వన్ టౌన్ పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. 45 మంది సిబ్బందితో 300 ఇళ్లను తనిఖీ చేసిన పోలీసులు, సరైన పత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఈ తనిఖీలు చేపట్టామన్నారు. గంజాయి, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు హెచ్చరించారు.

April 23, 2026 / 08:00 AM IST

రాజంపేటలో మొదలైన గంగమ్మ జాతర

అన్నమయ్య: రాజంపేట పట్టణంలో మన్నూరు గంగమ్మ జాతర ఇవాళ తెల్లవారుజామున వేడుకగా ప్రారంభమైంది. అమ్మవారు ఊరేగింపుగా ఆలయానికి బయల్దేరారు. ప్రతి ఇంటి వద్ద ప్రజలు పూజలు చేశారు. తర్వాత అమ్మవారు గద్దె పైకి చేరగా.. చుట్టు పక్కల వారు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 

April 23, 2026 / 08:00 AM IST

పాస్ పుస్తకాల జారీలో పొరపాట్లు ఉండొద్దు: జేసీ

W.G: పట్టాదారు పాస్ పుస్తకాల జారీ ప్రక్రియలో ఎటువంటి లోపాలు ఉండకూడదని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం సిద్ధాంతం రెవెన్యూ కార్యాలయంలో పాస్ పుస్తకాల పంపిణీపై ఆయన సమీక్ష చేశారు. కొత్త పుస్తకాల్లోని క్యూఆర్ ద్వారా భూమి వివరాలు, హద్దులు, యజమాని సమాచారం సులభంగా తెలుసుకోవచ్చని జేసీ అన్నారు.

April 23, 2026 / 08:00 AM IST

రేపు కైకలూరులో మెగా జాబ్ మేళా

కైకలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జితేంద్ర బాబు తెలిపారు. సుమారు 11 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, 775 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉందన్నారు. 10, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, ఎంబీఏ, పీజీ, బీటెక్ వంటి విద్యార్హతలు ఉండి 18-35 వయస్సున్నవారు అర్హులన్నారు.

April 23, 2026 / 08:00 AM IST

‘పరిశ్రమల అనుమతులు వేగవంతం చేయాలి’

SKLM: జిల్లాలో పారిశ్రామి కాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు సకాలంలో మంజూరు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి బుధవారం జూమ్ యాప్ ద్వారా అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతీ నియోజకవర్గంలో MSME పార్కుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు.

April 23, 2026 / 07:40 AM IST

‘తప్పులు లేకుండా ఇళ్ల గణన అన్ లైన్ చేయాలి’

VZM:  తప్పులు లేకుండా ఇళ్ల గణన ఆన్ లైన్ చేయాలని ఎన్యూమరేటర్లు,సూపర్వైజర్లను బొబ్బిలి మునిసిపల్ కమిషనర్‌ రామలక్ష్మి ఆదేశించారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో జన గణనపై మూడో విడత శిక్షణ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్లి జన గణన చేయాలన్నారు. జన గణనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 23, 2026 / 07:35 AM IST

ఆదోనిలో జనగణన స్వీయ నమోదు పూర్తి

KRNL: ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా సబ్ కలెక్టర్‌తో పాటు సిబ్బంది స్వీయ నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. ప్రజలు కూడా ఆన్‌లైన్ ద్వారా ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలని బుధవారం సూచించారు. డివిజన్ పరిధిలోని అన్ని శాఖల ఉద్యోగులు ఈ వారంలోగా నమోదు పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.

April 23, 2026 / 07:32 AM IST

బ్యాంకు ఉద్యోగికి టోకరా.. కేసు నమోదు

W.G: బంగారం బదిలీ పేరుతో నరసాపురంలోని ఓ బ్యాంకు ఉద్యోగిని నమ్మించి నగదు కాజేసిన ముగ్గురిపై కేసు నమోదైంది. వేరే బ్యాంకులో గోల్డ్‌లోన్ ఉందని, నగదు ఇస్తే అక్కడ కట్టి విడిపించుకొని ఈ బ్యాంకులో పెడతామని సన్నీ, తబు, జరీనాలు రూ.1.70 లక్షలు జమ చేయించుకుని పరారయ్యారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు ప్రసాద్ ఫిర్యాదు చేయగా SI జయలక్ష్మి కేసు నమోదు చేశారు.

April 23, 2026 / 07:30 AM IST

జిల్లాలో విస్తృత వాహన తనిఖీలు

ATP: రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలోని ప్రధాన రహదారులు, జాతీయ రహదారులపై విజిబుల్ పోలీసింగ్‌తో పాటు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. రాత్రి వేళల్లో ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసి అతివేగం, మద్యం సేవించి వాహనం నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

April 23, 2026 / 07:30 AM IST

పెదఅవుటపల్లిలో అదనపు గదులు ప్రారంభం

కృష్ణ: ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లి జడ్పీ హైస్కూల్‌లో రూ.31.16 లక్షలతో దాత వేగె లక్ష్మి శ్రీనివాసరావు నిర్మించిన అదనపు తరగతి గదులను MLA యార్లగడ్డ వెంకట్రావు బుధవారం రాత్రి ప్రారంభించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి లక్ష్యసాధన చేయాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

April 23, 2026 / 07:30 AM IST