కృష్ణా: వీవోఏలు ప్రభుత్వ లక్ష్యాలు సాధించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. శనివారం చల్లపల్లిలోని వెలుగు కార్యాలయంలో మండలంలోని 37మంది వీవోఏలకు నూతన మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ విచ్చేసి ఫోన్లు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
NDL: పాణ్యం మండలం కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇవాళ టీటీడీ బోర్డు సభ్యుడు, జడ్పీ మాజీ ఛైర్మన్ మల్లెల రాజశేఖర్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ఈవో రామకృష్ణ, అర్చకులు మర్యాదలతో వారికి స్వాగతం పలికి స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేయించారు. వారికి అర్చకులు తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేసి, శేష వస్త్రంతో సత్కరించారు.
PPM: పట్టాదారు పాస్ పుస్తకాల జారీ, మ్యుటేషన్లు, రీ-సర్వే ప్రక్రియలో ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి సర్వేయర్లను ఆదేశించారు. ఎక్కడా గడువు మించకుండా పారదర్శకంగా పనులు జరగాలని సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జేసీ యశ్వంత్ కుమార్ ఇవాళ డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు.
SKLM: పోలాకి మండలం గొల్లల వలసలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన కార్యక్రమం అధికారులు నిర్వహించారు. శనివారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రమణమూర్తి పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధక రంగ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. లేగ దూడలను పరిశీలించి, రైతులతో ముచ్చటించారు.
PLD: సత్తెనపల్లిలో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తారకరామ సాగర్‌లో పూడికతీత పనులు ప్రారంభించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వాడకం ఆపాలని సూచించారు. కూటమి ప్రభుత్వం చెత్త పన్ను రద్దు చేసి, పారిశుద్ధ్య కార్మికులకు రూ.కోటి బీమా కల్పిస్తుందన్నారు. చెరువులు బాగుచేసి భూగర్భ జలాలు పెంచాలన్నారు.
ATP: రాష్ట్రంలో సుపరిపాలన, అభివృద్ధి లక్ష్యంగా జిల్లా మంత్రులు సత్యకుమార్ యాదవ్, పయ్యావుల కేశవ్ సహా తొమ్మిది మంది మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్తోంది. ఈ నెల 21 నుంచి 27 వరకు వారం రోజుల పాటు వీరు అక్కడ ప్రత్యేక శిక్షణా తరగతుల్లో పాల్గొంటారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు కఠినమైన షెడ్యూల్‌తో ఈ శిక్షణ సాగనుంది.
ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 20న మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చిట్టబ్బాయి శనివారం తెలిపారు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
ATP: ఈ నెల 26న అనంతపురంలో ‘బీసీ గళం’ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇవాళ తాడేపల్లిలో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. జగన్ ప్రభుత్వం బీసీల సాధికారతకు పెద్దపీట వేసిందని, ప్రభుత్వ హయాంలో వారు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు.
GNTR: తెనాలిలోని నల్లమోతు చెంచు రామానాయుడు మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో సత్తా చాటారు. 4 స్వర్ణ, 3 రజత పతకాలు సాధించిన విద్యార్థులకు హెచ్ఎమ్ మెడల్స్ అందజేశారు. ఓ వెల్ఫేర్ సొసైటీ వారు 18 మంది బాల చిత్రకారులకు ఒక్కొక్కరికి రూ. 1000 చొప్పున, మొత్తం రూ. 15,000 విలువైన డ్రాయింగ్ మెటీరియల్‌ను పంపిణీ చేశారు.
KDP: టీడీపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ నేత బాలిశెట్టి ప్రసాద్‌ను ఇవాళ కమలాపురం MLA పుత్తా చైతన్య రెడ్డి సన్మానించారు. పార్టీ అధిష్టానం బాలిశెట్టి ప్రసాద్ సేవలను గుర్తించి అత్యున్నత పదవిని అప్పగించడం పట్ల MLA సంతోషం వ్యక్తం చేశారు. ఈ నియామకం ద్వారా రాబోయే రోజుల్లో జిల్లాలో TDP మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
NTR: తిరువూరు మండలం లక్ష్మీపురం MPPS పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంపుదల లక్ష్యంగా తిరువూరు UTF ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఫీజులు లేకుండా పూర్తి ఆంగ్ల మాధ్యమంలో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేస్తూ ఇంటింటికీ కరపత్రాలు పంచారు.
KRNL: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలులోని సి. క్యాంప్ రైతు బజార్‌ను శనివారం కలెక్టర్ డా.ఏ.సిరి ఆకస్మికంగా పరిశీలించారు. వ్యర్థ కూరగాయలు, ఆకు కూరలతో వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు బజారులో కూరగాయలను విక్రయిస్తున్న వారితో మాట్లాడి, వారి స్థితిగతులపై ఆరా తీశారు.
W.G. జనగణన కార్యక్రమంలో భాగంగా స్వీయ నమోదు విధానాన్ని వినియోగిస్తూ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. భీమవరం నియోజక వర్గంలో ఎమ్మెల్యే నివాసం వద్ద నుంచే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ పారదర్శకంగా, సులభంగా జనగణన ప్రక్రియను ముందుకు వెళ్తుందన్నారు.
ATP: రామగిరి మండలం పేరూరులో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర’ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే పరిటాల సునీత పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి నిర్దేశిత ప్రాంతాల్లోనే వేయాలని షాపుల నిర్వాహకులు, గ్రామస్తులకు సూచించారు.
NDL: డోన్ మండలంలోని మల్యాల మండల పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో బోధన, మౌలిక వసతులు, పరిశుభ్రతపై సమీక్షించి సూచనలు చేశారు. అంగన్వాడీలో పోషకాహారం, ఆరోగ్య సేవలపై దృష్టి సారించారు. ఉపాధ్యాయురాలు గైర్హాజరు కావడంతో అసంతృప్తి వ్యక్తం చేసి, చర్యలకు ఆదేశించారు.