• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాలో ‘జలం-జీవం’ కార్యక్రమం

SKLM జిల్లా లో శనివారం ‘స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. ఈ నెల ‘జలం జీవం’ అనే నినాదంతో నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారుల ను శుక్రవారం ఆదేశించారు. వేసవి దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలలో ఉన్న వర్షపు నీటి ఇంకుడు గుంతలను పునరుద్ధరించాలని సూచించారు

April 18, 2026 / 07:44 AM IST

అమలాపురంలో నేడు భారీ జాబ్ మేళా

కోనసీమ: అమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో వికాస ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు తెలిపారు. ఈ జాబ్ మేళాలకు 15 కంపెనీలు హాజరవ్వగా.. మొత్తం 1300 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల మేరకు 18-30 ఏళ్లు ఉండి, టెన్త్ ఆపై చదివిన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

April 18, 2026 / 07:42 AM IST

పలు పోలీస్ స్టేషను పరిధిలో డ్రోన్ సర్వే

PPM: జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలతో పట్టణంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు పోలీసులు శుక్రవారం డ్రోన్ సర్వే చేశారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషను ఎస్. హెచ్. ఓ స్థాయి అధికారులతో ప్రతి వాహనాన్ని నిశితంగా తనిఖీలు చేశారు. మహిళలపై లైంగిక దాడులు అరికట్టేందుకు శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని యువతులకు అవగాహన కల్పించారు.

April 18, 2026 / 07:41 AM IST

‘ఎలమంచిలికి కేజీబీని మంజూరు చేయాలి’

AKP: ఎలమంచిలికి కేజీబీవీని మంజూరు చేయాలని ఎంపీపీ రాజాన శేషు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఎంపీపీ కార్యాలయాన్ని సందర్శించిన డీఈఓ అప్పారావు నాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు.

April 18, 2026 / 07:41 AM IST

మహిళా పారిశ్రామికవేత్తల తయారీకి చర్యలు: కలెక్టర్

KKD: మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధితో పాటు వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ కలెక్టర్ హరిందర ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డ్వాక్రా, మెప్మా, సెర్ప్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 38,528 మహిళా సంఘాల పనితీరు, మంజూరు చేస్తున్న రుణాలు, రికవరీ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

April 18, 2026 / 07:40 AM IST

దాలివలసలో జీడితోటలకు అగ్నిప్రమాదం

AKP: కె.కోటపాడు మండలం దాలివలస గ్రామ సమీపంలోని జీడితోటల్లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 11.30 గంటల సమయంలో మంటలు చెలరేగి సుమారు 4.5 ఎకరాల్లో తోటలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న సబ్బవరం అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. స్థానిక యువకులు, రైతులు సహాయపడ్డారు.

April 18, 2026 / 07:38 AM IST

రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకున్న పోలీసులు

కృష్ణా: రేషన్ బియ్యం అక్రమ రవాణాను కోడూరు పోలీసులు అడ్డుకున్నారు. అవనిగడ్డ మండలం వేకనూరుకు చెందిన కరుణకుమార్ సుమారు రెండు వేల కేజీల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఐ చాణక్య తమ సిబ్బందితో కోడూరు మండలం వీ.కొత్తపాలెంలో అడ్డుకున్నారు. అతనిని అరెస్ట్ చేసి, రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

April 18, 2026 / 07:36 AM IST

తెల్లని పుష్పాలతో కనువిందు చేస్తున్న పలవరేణి

అన్నమయ్య: తంబళ్లపల్లె(M) బోయపల్లెకు సమీపంలో ఓ చెట్టు నిండా తెల్లని పువ్వులతో కనువిందు చేస్తోంది. వసంత కాలంలో మాత్రమే పూచే ఈ చెట్టు రోడ్డు మార్గంలో వెళ్లే వారిని, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది. గ్రామాల్లో, పల్లెల్లో పొలంగట్లు, అటవీప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే చెట్టు పలు ఔషద గుణాలు కలిగి ఉంటుంది.

April 18, 2026 / 07:32 AM IST

‘లే అవుట్ల క్రమబద్దీకరణ పై అభ్యంతరాలు తెలపవచ్చు’

VZM బొబ్బిలి మున్సిపాలిటీలోని 8 లే అవుట్లను క్రమబద్దీకరణ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మునిసిపల్ కమీషనర్ రామలక్ష్మి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఈ క్రమబద్దికరణపై ఎవరైనా ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా 15 రోజుల్లోగా లిఖిత పూర్వకంగా తెలపాలని సూచించారు. ఈ మేరకు క్రమబద్దీకరణ లే అవుట్‌ వివరాలను మున్సిపల్‌ కార్యాలయం నోటీసు బోర్డులో ప్రదర్శించారు.

April 18, 2026 / 07:31 AM IST

మహిళా రక్షణ చట్టాలపై అవగాహన

W.G: నరసాపురంలో కళాశాలలో శుక్రవారం మహిళా రక్షణ చట్టాలు, కెరీర్ గైడెన్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు గన్నాబత్తుల సత్యవతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ జయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థినులు సోషల్ మీడియాలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత వివరాలను పంచుకోకూడదని సూచించారు.

April 18, 2026 / 07:30 AM IST

వృద్ధుడు కనిపించలేదంటూ ఫిర్యాదు

KDP: జమ్మలమడుగు పాతబస్టాండ్లో నివాసం ఉంటున్న భూమా పెద్దపాపోడు కనిపించడంలేదంటూ భార్య పార్వతమ్మ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 6న ఇంటినుంచి వెళ్లిపోయిన భూమా పెద్దపాపోడు తిరిగి ఇంటికిరా లేదు. బంధువుల ఇళ్లకు వెళ్లాడని విచారించిన అక్కడికి వెళ్లలేదంటూ చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. గాలింపు చర్యలను చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.

April 18, 2026 / 07:30 AM IST

రాహుల్ గాంధీపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం

KRNL: లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై శుక్రవారం మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సరిహద్దులను కాపాడే సైన్యాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదన్నారు. పుల్వామా వంటి ఉదంతాలను తక్కువ చేసి మాట్లాడటం రాహుల్ అవివేకానికి నిదర్శనమని అన్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా రాహుల్ ఏదో తెలియని మానసిక ఆనందం పొందుతున్నారన్నారు.

April 18, 2026 / 07:28 AM IST

అభివృద్ధి పనులపై మంత్రి సవిత సమీక్ష

సత్యసాయి: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో ఎన్ఆర్ఈజీఎస్ అధికారులతో మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో ఇప్పటికే 61 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 73 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయినట్లు ఆమె వెల్లడించారు. అలాగే 220 గోకులం షెడ్లు, 139 నీటి తొట్టీల పనులు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్ఆర్ఈజీఎస్ పీడీ విజయేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

April 18, 2026 / 07:24 AM IST

కేజీబీవీలో మెగా ఆయుర్వేద శిబిరం

PLD: రాజుపాలెం స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ ఆర్.శ్రీనివాస్ బృందం విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు చేసి, వేసవి జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. సుమారు 216 మంది విద్యార్థినులకు, సిబ్బందికి ఎంఈవో నరసింహారావు చేతుల మీదుగా ఉచితంగా ఆయుష్ మందులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

April 18, 2026 / 07:23 AM IST

‘టీనేజీ ప్రెగ్నెన్సీపై యువతకు అవగాహన తప్పనిసరి’

PPM: టీనేజ్‌ ప్రెగ్నెన్సీ వలన కలిగే అనర్దాలపై శుక్రవారం కలెక్టరేట్‌లో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి పాల్గొని కౌమార దశలో గర్భధారణ – దుష్ప్రభావాలపై పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకోవడం, గర్భం దాల్చడం వంటి విషయాలపై యువతకు అవగాహన తప్పనిసరని అన్నారు.

April 18, 2026 / 07:20 AM IST