అన్నమయ్య: తంబళ్లపల్లె(M) బోయపల్లెకు సమీపంలో ఓ చెట్టు నిండా తెల్లని పువ్వులతో కనువిందు చేస్తోంది. వసంత కాలంలో మాత్రమే పూచే ఈ చెట్టు రోడ్డు మార్గంలో వెళ్లే వారిని, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది. గ్రామాల్లో, పల్లెల్లో పొలంగట్లు, అటవీప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే చెట్టు పలు ఔషద గుణాలు కలిగి ఉంటుంది.