• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పేద కుటుంబానికి అండగా మంత్రి గొట్టిపాటి

PLD: సంతమాగులూరులో అనారోగ్యంతో బాధపడుతున్న ఏల్చూరు గ్రామానికి చెందిన అల్లడి వెంకటేష్ కుటుంబానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అండగా నిలిచారు. వెంకటేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, మంత్రి చొరవతో మంజూరైన రూ. 2,10,000 LOC చెక్కును శనివారం ఏల్చూరు టీడీపీ కార్యాలయంలో అందజేశారు.

April 25, 2026 / 04:51 PM IST

చిత్తూరు జిల్లాలో పోలీసుల తనిఖీలు

CTR: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులను విచారించి, వాహనాలను తనిఖీ చేశారు. ప్రజలు తమ పరిసరాలలో అనుమానాస్పద వ్యక్తుల సంచరిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. నేరాలను ముందుగా గుర్తించి వాటిని అరికట్టేందుకే తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు.

April 25, 2026 / 04:46 PM IST

చీమకుర్తిలో కార్డెన్ సర్చ్

ప్రకాశం: ఆపరేషన్ వజ్రాహర్ కార్యక్రమంలో భాగంగా చీమకుర్తి మండలంలో శనివారం పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మత్తుపదార్థాలు గంజాయి వంటి అంశాలపై అవగాహన కల్పించి ప్రజలను హెచ్చరించారు.

April 25, 2026 / 04:45 PM IST

వైసీపీ ప్రభుత్వంలో కొట్లాది రూపాయలు దోచుకున్నారు: సోమిరెడ్డి

NLR: YCP ప్రభుత్వంలో కోట్లాది రూపాయలను గ్రావెల్ పేరుతో దోచుకున్నారని MLA సోమిరెడ్డి అన్నారు. ఆయన మనుబోలు మండలం ఎల్ ఎన్ పురం గ్రామంలో త్రీఫేస్ ట్రాన్సఫార్మర్‌ను ప్రారంభించి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ‌.. YCP హాయాంలో ఎంపీ పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని అన్నారు. గ్రావెల్ తోలే క్వారీని మూసివేయమంటే ఇబ్బంది ఎవరు తీరుస్తారని విమర్శించారు.

April 25, 2026 / 04:45 PM IST

మహిళల భద్రత మనందరి బాధ్యత: ఎమ్మెల్యే

KRNL: మహిళల భద్రత మనందరి బాధ్యత అని MLA బొగ్గుల దస్తగిరి అన్నారు. సి.బెళగల్ MPDO కార్యాలయంలో ఇవాళ SI వేణుగోపాల్ రాజు ఏర్పాటు చేసిన ‘మహిళలపై జరుగుతున్న నేరాలు’ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల కోసం ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకొచ్చిందన్నారు. MRO వెంకటలక్ష్మి, MPDO రాణెమ్మ, సీఐ తబ్రేజ్ పాల్గొన్నారు.

April 25, 2026 / 04:43 PM IST

సౌరశక్తి ప్రాముఖ్యత పర్యావరణపై అవగాహన

NTR: నందిగామ కాకాని నగర్‌లో సోలార్ అవేర్‌నెస్ 1కే ర్యాలీ ‘రన్ సన్–రన్ టుడే, పవర్ టుమారో’ ఘనంగా జరిగింది. NSEFI NREDCAP, PGL RENEWABLES సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. సౌరశక్తి ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు.

April 25, 2026 / 04:43 PM IST

కైకలూరులో ముగిసిన పోషణ పక్వాడ కార్యక్రమం

ELR: కైకలూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో 15 రోజుల పాటు నిర్వహించిన పోషణ్ పక్వాడా కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెట్రి‌సెల్వి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లులు, ఆరేళ్లలోపు పిల్లల పోషణ మెరుగుదలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తృణధాన్యాల వినియోగం, వైవిధ్యభరితమైన ఆహారం ప్రాముఖ్యతను వివరించారు.

April 25, 2026 / 04:39 PM IST

పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

KKD: ఏలేశ్వరం గ్రామంలోని కప్పలచెరువు వద్ద పార్కు నిర్మాణానికి ఎమ్మెల్యే సత్యప్రభ శనివారం కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ పార్కు నిర్మాణంతో స్థానిక ప్రజలకు విశ్రాంతి కల్పించడంతో పాటు గ్రామ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

April 25, 2026 / 04:39 PM IST

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం మజ్జిగ వితరణ

EG: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలని జనసేన సిటీ కార్యాలయం వద్ద మేకల సునీల్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ శ్రీ అనుశ్రీ సత్యనారాయణ మజ్జిగ పంపిణి చేపట్టారు. అధినేత త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నల్లంశెట్టి వీరబాబు, విన్న వాసు, బోయలపల్లి సుందరయ్య, శంకర్ పాల్గొన్నారు.

April 25, 2026 / 04:38 PM IST

బ్రహ్మంగారి మఠానికి వెళ్తున్నారా..?

KDP: బ్రహ్మంగారి మఠంలో జరుగుతున్న గురుపూజ మహోత్సవాలకు వచ్చే భక్తులకు ప్రస్తుతం మఠం పరిసరాల్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేదని నిర్వాహకులు తెలిపారు. దీంతో వాహనాలతో వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి బైక్‌లు, కార్లు, ఇతర వాహనాల్లో వచ్చే భక్తులు తమ ప్రాంతాల్లోనే సరిపడా ఇంధనం నింపుకొని రావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

April 25, 2026 / 04:38 PM IST

భీమవరంలో సీపీఎం నిరసన

WG: ఇరాన్ పై అమెరికా యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని నిరసిస్తూ శనివారం భీమవరంలో సీపీఎం జిల్లా కమిటీ భారీ ర్యాలీ నిర్వహించింది. పట్టణంలోని ఎంపీడీవో ఆఫీసు నుంచి సబ్ జైలు పెట్రోల్ బంక్ వరకు ఈ నిరసన సాగింది. యుద్ధం సాకుతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్ విమర్శించారు.

April 25, 2026 / 04:37 PM IST

చింతపల్లి వీరభద్రరావు విలువలతో కూడిన వ్యక్తి: మంత్రి సుభాష్

కోనసీమ: ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ చింతపల్లి వీరభద్రరావు సంతాప సభలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని భావోద్వేగంగా నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. చింతపల్లి వీరభద్రరావు విలువలతో కూడిన గొప్ప వ్యక్తి, కల్మషం లేని మనిషి అని కొనియాడారు. పదవి కంటే మానవ సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడని గుర్తు చేశారు.

April 25, 2026 / 04:34 PM IST

సమస్యల పరిష్కారమే లక్ష్యం: బోయ గిరిజమ్మ

ATP: జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు లేవనెత్తిన ప్రజా సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ఆదేశించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, ఉరవకొండ, శింగనమల వంటి మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. 108 అంబులెన్స్ సేవల్లో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.

April 25, 2026 / 04:32 PM IST

ఐతవరం సచివాలయంలో ఎంపీడీవో తనిఖీలు

NTR: నందిగామ మండలంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆర్.వీ.ఎస్.హెచ్.వి.యం ప్రసాదరావు ఐతవరం గ్రామంలో పశువుల తొట్టెను పరిశీలించారు. అక్కడి నిర్వహణపై సూచనలు ఇచ్చారు. అలాగే సెన్సెస్ 2027 సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి సచివాలయం సిబ్బంది రోజుకు కేటాయించిన 20 టార్గెట్ పూర్తి చేస్తున్నారా అనే అంశంపై రికార్డులను పరిశీలించారు.

April 25, 2026 / 04:30 PM IST

మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాయిదా

సత్యసాయి: పెనుకొండలో మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం శనివారం వాయిదా పడటంపై టీడీపీ పట్టణ కన్వీనర్ శ్రీరాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.3 కోట్లతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు అనుమతులు ఇవ్వాల్సిన కీలక సమావేశాన్ని కావాలనే వాయిదా వేశారని వైసీపీ కౌన్సిలర్లపై ఆరోపించారు. బుధవారానికి సమావేశం వాయిదా వేసినట్లు మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ తెలిపారు.

April 25, 2026 / 04:30 PM IST