»Ys Jagan Mohan Reddy Criticised 19 Opposition Parties Decision On Parliament Inauguration
New Parliament సీఎం జగన్ సంచలనం.. ‘19 పార్టీల నిర్ణయం తప్పు’ అని వ్యాఖ్యలు
మోదీతో మీకు అవసరం ఉంది.. కాబట్టి వెళ్తామంటున్నారు. అసలు రాజ్యాంగ విరుద్ధంగా జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఎలా చెబుతారు?’‘విలువల గురించి సీఎం జగన్ మాట్లాడడం హాస్యస్పదంగా ఉంది..
ఏపీ సీఎం జగన్ (Jagan)లో అనూహ్య మార్పు వచ్చింది. ఏకంగా 19 పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగంగా తప్పుబట్టారు. గతంలో జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను పట్టించుకోని ఆయన అనూహ్యంగా ఇతర పార్టీలను విమర్శించారు. మీరు తీసుకున్న నిర్ణయం తప్పని పేర్కొన్నారు. దేశమంతా ఒకవైపు వెళ్తుంటే ఆయన మాత్రం మరో వైపు నిలబడ్డారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం (Decision) తీవ్ర విస్మయనికి గురి చేసింది. దేశవ్యాప్తంగా అతడిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే..
సెంట్రల్ విస్టాలో భాగంగా నిర్మించిన కొత్త పార్లమెంట్ (New Parliament) భవనాన్ని ఈనెల 28వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) చేతులమీదుగా ప్రారంభించాల్సి ఉండగా.. ఆమెకు ఆహ్వానం (Invitation) అందలేదు. ప్రధాని మోదీ ప్రారంభించనుండడం తీవ్ర దుమారం రేపుతోంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ కార్యక్రమం చేపడుతుండడంతో దేశంలోని దాదాపు 20 పార్టీలు (Parties) తప్పుబట్టాయి. ప్రారంభోత్సవాన్ని తాము బహిష్కరిస్తున్నామని (Boycott) ఏకంగా 19 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. అయితే వాటికి విరుద్ధంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరవుతానని ప్రకటించారు.
కార్యక్రమానికి హాజరవుతానని ప్రకటిస్తే మంచిదే. కానీ 19 పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని కూడా తప్పుబట్టారు. తొలిసారి దేశంలోని ఇతర పార్టీలపై జగన్ విమర్శలు ( చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చేసిన ట్వీట్ (Tweet) సంచలనం రేపుతోంది. జగన్ ట్వీట్ ఇలా ఉంది. ‘పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్య (Democracy) దేవాలయం. అది మన దేశం ఆత్మను ప్రతిబింబిస్తుంది. అది మన దేశ ప్రజలకే కాదు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినది. ఇలాంటి శుభ కార్యాన్ని బహిష్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు. రాజకీయ విబేధాలను అన్నింటినీ పక్కనబెట్టి ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావాలని కోరుతున్నా. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ కార్యక్రమానికి వైసీపీ హాజరవుతుంది’ అని ట్వీట్ చేశారు.
ఈ ప్రకటనపై అన్ని రాజకీయ పార్టీలు (Political Parties) విస్మయం వ్యక్తం చేశాయి. ఆయన వెళ్తే వెళ్లాలి గానీ ఇతర పార్టీల నిర్ణయాన్ని తప్పుబట్టడానికి ఆయన ఎవరు? అని వివిధ పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ‘మోదీతో మీకు అవసరం ఉంది.. కాబట్టి వెళ్తామంటున్నారు. అసలు రాజ్యాంగ విరుద్ధంగా జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని (Attend) ఎలా చెబుతారు’ అని ఓ జాతీయ పార్టీ నాయకుడు తెలిపారు. ‘విలువల గురించి సీఎం జగన్ మాట్లాడడం హాస్యస్పదంగా ఉంది. అకస్మాత్తుగా మోదీకి మద్దతుగా నిలబడడం వెనుక ఉన్న రహాస్యమేమిటో అందరికీ తెలిసిందే’ అని మరో పార్టీ నేత ఎద్దేవా చేశారు.
I congratulate @narendramodi ji for dedicating the grand, majestic and spacious Parliament building to the nation. Parliament, being the temple of democracy, reflects our nation's soul and belongs to the people of our country and all the political parties. Boycotting such an…