జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pavan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. వారాహి విజయయాత్ర(Vijayatra)లో భాగంగా పవన్ నరసాపురంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ అధికార వైసీపీ (YCP)పై నిప్పులు చెరిగారు. రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతూ.. ప్రజలను ఇబ్బందుకులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ప్రక్షాళన, పరివర్తన కోసమే తన పోరాటం అని.. ఈ పోరాటంలో చివరి వరకు తాను బతికుంటానో లేదో తెలిదయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది ప్రజల చెమట, రక్తాన్ని పీల్చేస్తున్నారన్నారు. జనసేన (Janasena)కు మద్దతు తెలిపిన నరసాపురం ప్రభాస్ అభిమానులకు అభినందనలు తెలుపుతున్నానని ఆయన తెలిపారు.
ప్రభాస్ (Prabhas) బాహుబలి చేసినా, ఆదిపురుష్ చేసినా రోజుకు 500 మంది నుంచి 1000 మందికి ఉపాధి కల్పిస్తారని, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తారని పవన్ వివరించారు. ప్రభాస్ ట్యాక్సులు కడతాడని వెల్లడించారు.కానీ ఈ జగన్ నీతిగా సంపాదించడని, వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడు చాలా బాధ కలిగిందని తెలిపారు. అవినీతి చేసిన వ్యక్తులను అందలం ఎక్కించారని, కానీ అంబేద్కర్(Ambedkar), లాల్ బహదూర్ శాస్త్రి స్ఫూర్తితో వచ్చిన తనను మాత్రం ఓడించారని వివరించారు. అయితే ఇవాళ ఇంతమంది తనకు అండగా నిలవడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు.
పులివెందుల (Pulivendula) విద్యా సంస్కృతిని గోదావరి జిల్లాలకు రానివ్వబోమని స్పష్టం చేశారు. “జగన్ మోహన్ రెడ్డికి చెబుతున్నా… మీరు పులివెందుల రౌడీ రాజకీయం గోదావరి జిల్లాలకు తీసుకువచ్చారు. నరసాపురం (Narasapuram) నుంచి చెబుతున్నా… ఇది గూండాలకు, రౌడీలకు భయపడే నేల కాదు… ఎవర్నయినా ఎన్నిసార్లు భయపెట్టగలరు? కోనసీమలో డీఎస్పీని ఓ మంత్రి కొడుకు కొట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే విప్లవాలు పుట్టుకొస్తాయి. వైసీపీ గెలిస్తే రాజ్యాంగం గెలిచినట్టు… లేకపోతే లేదు అననట్టుగా మాట్లాడతాడు. ఇక్కడ పసలదీవి పంచాయతీలో జనసేనకు 1,400 ఓట్లు రాగా, వైసీపీకి 380 ఓట్లు వచ్చాయి. దాంతో పంచాయతీకి నిధులు ఇవ్వడం మానేశాడు. ఇదేనా రాజ్యాంగం?” అంటూ పవన్ విమర్శలు కురిపించారు.