ADB: ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని CITU జిల్లా కార్యదర్శి కిరణ్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రూ.18 వేల వేతనం, ఎన్హెచ్ఎంకు నిధులను కేటాయించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 48 గంటలు నిరసన దీక్ష చేపట్టారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.