AP: రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లలో పాలకవర్గం గడువు ఇవాళ్టితో ముగియనుంది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారులు రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గం ఏర్పడే వరకు వీరే పాలన చూసుకుంటారు. ఏలూరు కార్పొరేషన్‌కు జూలై 29, మరో 13 పురపాలికల్లో నవంబర్ 21తో గడువు ముగియనుంది. పంచాయతీల్లోనూ APR 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది.