GDWL: కేటిదొడ్డి మండలంలో గృహ జ్యోతి పథకం వర్తించని వినియోగదారుల నుంచి పెండింగ్లో ఉన్న విద్యుత్ బిల్లుల వసూలును అధికారులు వేగవంతం చేశారు. మండల ఏఈ అనిల్ కుమార్ ఆదేశాల మేరకు లైన్మెన్ మునిస్వామి సోమవారం రికవరీ చేపట్టారు. విద్యుత్ వినియోగదారులు బకాయిలను వెంటనే చెల్లించి శాఖకు సహకరించాలని అధికారులు కోరారు.