KNR: కరీంనగర్ ‘ప్రజావాణి’కి వచ్చే ఫిర్యాదులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని మేయర్ కొలగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వారు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో 12 సహా మొత్తం 24 వినతులు అందాయని పేర్కొన్నారు.