• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

శతాబ్దం తర్వాత గంగమ్మ గావు జాతర

PPM: మక్కువ మండల కేంద్రంలోని స్థానిక యాదవ వీధిలో కొల్లి వారి కుల దైవం, యాదవుల ఇలవేల్పు గంగమ్మ తల్లి గావు పండుగ మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పందిరిరాట అరటి గెలలు, చీరలు వేలాడదీసి, మొక్కులు చెల్లించుకున్నారు. దాదాపు వంద సంవత్సరాల తర్వాత ఈ సంప్రదాయ వేడుకను మళ్లీ నిర్వహించడంతో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

March 18, 2026 / 08:40 AM IST

నేడు సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం

KRNL: కృష్ణగిరి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఇవాళ 18వ విడత సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో మోహన్ కుమార్ తెలిపారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి గత నెల 20 నుంచి ఈ నెల 15 వరకు తనిఖీ చేపట్టి గ్రామసభలు నిర్వహించడం జరిగిందన్నారు.

March 18, 2026 / 08:40 AM IST

15 రోజులకు సరిపడా LPG నిల్వలు

VSP: ప్రస్తుతం 15 రోజులకు సరిపడా LPG నిల్వలు ఉన్నాయని, అదనంగా 24 వేల మెట్రిక్ టన్నుల LPG వచ్చిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. గ్యాస్ సిలెండర్ల డెలివరీ సమయాన్ని 1.5 రోజులకు కుదించాలని అధికారులను ఆదేశించారు.

March 18, 2026 / 08:34 AM IST

ఒంగోలు పార్లమెంట్ పరిధిలో మంత్రి స్వామి నెం.1

ప్రకాశం: ఒంగోలు పార్లమెంట్ పరిధిలో రైస్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో మంత్రి స్వామి ప్రథమ స్థానంలో నిలిచినట్లు సర్వే పేర్కొంది. పలువురు విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ మంత్రి స్వామి నియోజకవర్గ ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండడం, శాసనసభలో సమస్యలపై గళం విప్పుతూ పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారన్నారు.  ఆయన వరుసగా 3 పర్యాయాలు గెలిచారు.

March 18, 2026 / 08:32 AM IST

యువతి అదృశ్యంపై పోలీసుల కేసు నమోదు

కోనసీమ: రాజోలు మండలంలోని ఒక గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం గుడికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి, తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు తెలిపారు.

March 18, 2026 / 08:31 AM IST

చిత్రావతి నదిలో ఇసుక మాఫియాపై అధికారుల ఉక్కుపాదం

సత్యసాయి: పుట్టపర్తి సమీపంలోని కర్ణాటనాగేపల్లి, కదిరి బస్టాండ్ పరిసరాల్లో చిత్రావతి నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రెండు ట్రాక్టర్లు, ఒక హిటాచీ యంత్రాన్ని సీజ్ చేశారు. పుట్టపర్తి ఆర్డీవో సువర్ణ, గనుల శాఖ ఏడీ అమీర్ బాషా ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన కేసులు నమోదు చేస్తామన్నారు.

March 18, 2026 / 08:28 AM IST

‘HMను దూషించిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలి’

AKP: నక్కపల్లి మండలం వేంపాడు ఎంపీపీ స్కూల్ హెచ్ఎం ఆర్.చిరంజీవిని దూషించిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని కుల వివక్ష పోరాట కమిటీ డిమాండ్ చేసింది. దళితులైన హెచ్ఎంని అదే స్కూల్లో పనిచేస్తున్న శివాజీ అవమానించినట్లు కమిటీ ప్రతినిధులు ఎం సుబ్బన్న, చిరంజీవి ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు.

March 18, 2026 / 08:26 AM IST

భూమి ఆక్రమణ యత్నం.. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఆవేదన

KDP: కాశినాయన మండలం ఇటుకులపాడులో భూ వివాదం ఉద్రిక్తంగా మారింది. గంజికుంట సుబ్బరాజేశ్వరరావు మాట్లాడుతూ.. సర్వే నంబర్ 458లో తాము చట్టబద్ధంగా కొనుగోలు చేసిన 18.40 సెంట్ల భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉండగా కోర్టు నుంచి ఇంటిరిమ్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా పొందామని తెలిపారు.

March 18, 2026 / 08:25 AM IST

తిరుపతి SVUకు నిధులు విడుదల

TPT: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ(SVU)కి ప్రభుత్వం రూ.18.85 కోట్ల అదనపు గ్రాంటును విడుదల చేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు వెల్లడించారు. విశ్వవిద్యాలయం జీతభత్యాల కోసం నిధులు కేటాయించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి విశ్వవిద్యాలయ అధికారులు, సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

March 18, 2026 / 08:25 AM IST

సంస్థల ఏర్పాటుకు భూముల కేటాయింపు

GNTR: రాజధాని అమరావతిలో విద్యా, వైద్య, పరిపాలనా రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాయపూడిలో CBSE ప్రాంతీయ కార్యాలయానికి 0.8 ఎకరాలు, కురగల్లు-నవులూరు ప్రాంతంలో ఏపీ ఎస్ఐఆర్డీ (AP SIRD) క్యాంపస్ నిర్మాణానికి 5.043 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నిడమర్రులో అత్యాధునిక కార్పొరేట్ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నారు.

March 18, 2026 / 08:20 AM IST

ఎమ్మిగనూరులో పట్టాల పంపిణీ కార్యక్రమం

KRNL: ఎమ్మిగనూరులో MLA జయనాగేశ్వర రెడ్డి 64 కుటుంబాలకు నిన్న పట్టాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రహరీ పక్కన నివసిస్తున్న కుటుంబాలు కోర్టు ఆదేశాల మేరకు స్థలాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు నిరాశ్రయులుగా మారే పరిస్థితి నెలకొనగా MLA ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతీ కుటుంబానికి 3 సెంట్ల చొప్పున పట్టాలు మంజూరు చేయించారు.

March 18, 2026 / 08:17 AM IST

పదో తరగతి విద్యార్థిని బలవన్మరణం

ATP: పదో తరగతి పరీక్షల వేళ ఫోన్‌ చూడొద్దు అని మందలించడంతో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల వివరాల మేరకు.. కంబదూరు మండలం గుండ్లపల్లి కాలనీకి చెందిన మాధవి(15) రీల్స్‌ చూస్తుండగా తల్లిదండ్రులు మందలించారు. పరీక్షలకు చదువుకోవాలని సూచించారు. మనస్తాపానికి గురైన బాలిక విష గులికలు తీసుకోవడంతో చనిపోయింది.

March 18, 2026 / 08:14 AM IST

‘ఉగాదికి మధ్యంతర భృతి ప్రకటించాలి’

W.G: ఉగాది పర్వదినం సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్ విజయరామరాజు, సెక్రటరీ జనరల్ ప్రకాశం కోరారు. ఎన్నికల హామీ మేరకు పీఆర్సీ కమిషనర్‌ను నియమించి, పెండింగ్లో ఉన్న డీఏలను తక్షణమే విడుదల చేయాలని మంగళవారం వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు తీపి కబురు అందిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

March 18, 2026 / 08:13 AM IST

నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం

ATP: ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగ శక్తి పథకాన్ని బుధవారం నుంచి అమలు చేయనున్నట్లు గుంతకల్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఖాజావలి తెలిపారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్‌ప్రెస్ బస్సులో 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు జీరో చార్జి ఉచిత టికెట్లు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. దివ్యాంగులకు జారీచేసిన బస్ పాస్ ఐడి కార్డులను చూపించాలన్నారు.

March 18, 2026 / 08:12 AM IST

ప్రయాణికులకు షాక్.. రేణిగుంట రైల్వే బ్రిడ్జి క్లోజ్..!

KDP: రేణిగుంట రైల్వే అండర్ బ్రిడ్జిను మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు RDO భాను ప్రకాశ్ రెడ్డి ప్రకటించారు. 50 ఏళ్ల కాలం నాటి బ్రిడ్జి కావడంతో మరమ్మతులు అవసరమని రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు. కరకంబాడి రోడ్, కొత్త బైపాస్ మార్గాల్లో వాహనాలు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ మార్గంలో కడప వాహనదారులు వెళ్తుంటారు కాబట్టి గమనించాలన్నారు.

March 18, 2026 / 08:09 AM IST