• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బస్టాండ్‌లో బంగారు గొలుసు మాయం.. కేసు నమోదు

ATP: గుత్తి ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం రాత్రి బొమ్మనహాళ్ మండలం గోవిందవాడ గ్రామానికి చెందిన గౌతమి అనే మహిళా ప్రయాణికురాలి మూడు తులాల బంగారు గొలుసు మాయమైంది. గౌతమి గుత్తి నుండి గుంతకల్‌కు బస్సు ఎక్కుతుండగా ఈ ఘటన జరిగింది. బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

March 30, 2026 / 11:00 AM IST

ఘాట్ రోడ్డులో ప్రమాదం.. డ్రైవర్ మృతి

అన్నమయ్య: చిట్వేలి–రాపూరు ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు నుంచి వేంపల్లికి నిమ్మకాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఘాట్ రోడ్డులోని కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి లారీ నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు.

March 30, 2026 / 10:46 AM IST

తాడేపల్లిగూడెంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

W.G: తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఉంగుటూరు మండలం చిన్నవెల్లమిల్లి గ్రామానికి చెందిన రత్నకుమార్(51)గా గుర్తించారు. రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగింది. ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. రైల్వే ఎస్ఐ అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 30, 2026 / 10:45 AM IST

ఛలో మూలపేటకు వైసీపీ ర్యాలీ

ఛలో మూలపేటకు వైసీపీ శ్రేణులు తరలి వెళ్లారు. విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో సోమవారం పార్టీ కార్యాలయం నుంచి మూలపేట పోర్టు వైపు ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు మళ్ళ విజయప్రసాద్, తిప్పల దేవన్ రెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

March 30, 2026 / 10:40 AM IST

పరారీ ఖైదీపై పాతిక వేల పారితోషికం

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్య సేవలు పొందుతూ శుక్రవారం పరారైన రిమాండ్ ఖైదీ అజయ్‌పై తెనాలి పోలీసులు 25 వేల రూపాయల పారితోషికం ప్రకటించారు. ఇప్పటికే ఖైదీ పరారీ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులను ఎస్పీ వకుల్ జిందాల్ సస్పెండ్ చేశారు. అజయ్ అలియాస్ భీముడు ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

March 30, 2026 / 10:40 AM IST

కడప జిల్లాలో మంత్రి సవిత పర్యటన

సత్యసాయి: పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమస్యలపై మంత్రి సవిత ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గ ఇంచార్జ్ బీటెక్ రవితో కలిసి స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. నియోజకవర్గంలోని ప్రజల ఇబ్బందులను తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు.

March 30, 2026 / 10:39 AM IST

ఉపాధిహామీ వేతనాలు అందక వేతనదారుల ఇబ్బందులు

VZM: బొబ్బిలి మండలం కాసిందోరవలస పంచాయతీ పరిధిలో ఉన్న ఉపాధిహామీ వేతనదారులు వేతనాలు అందక తీవ్ర అవస్థలుపడుతున్నారు. 8వారాలుగా పనిచేస్తున్నా.. ఇప్పటికి రూపాయి కూడ అందలేదని వాపోతున్నారు. గతంలో అయితే 2వారాలలోపు వేతనాలు జమ అయ్యేవని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం పేరు మార్చడం, వేతనాలు అలసత్వం జరగడం పట్ల, ఈ పధకాన్ని తీసివేస్తున్నారనే చర్చ మొదలైంది.

March 30, 2026 / 10:30 AM IST

కంచికచర్లలో గ్యాస్ కోసం బారులు తీరిన జనం

NTR: కంచికచర్ల జుజ్జూరు రోడ్డులోని గ్యాస్‌ ఏజెన్సీ వద్ద సోమవారం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిలిండర్ల పంపిణీలో సమయపాలన పాటించకపోవడంతో ఖాళీ బండలతో నడిరోడ్డుపై వెయిట్ చేస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. మధిర ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఏజెన్సీ నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

March 30, 2026 / 10:30 AM IST

ఎమ్మిగనూరులో రూ.6.80 లక్షల బంగారం దోపిడీ.!

KRNL: ఎమ్మిగనూరులో కెనరా బ్యాంక్ సమీపంలో స్కూటీ డిక్కీలో ఉంచిన రూ.6.80 లక్షల విలువైన బంగారు ఆభరణాల దొంగతనం కేసును పోలీసులు ఆదివారం ఛేదించారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ మధుసూదన్ రెడ్డి సిబ్బంది సీసీటీవీ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

March 30, 2026 / 10:29 AM IST

అర్ధనారీశ్వరునిగా శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణంలోని బస్టాండ్ సమీపాన వెలసిన శ్రీ విరుపాక్షి మారెమ్మ సోమవారం అర్ధనారీశ్వరుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఉదయమే అర్చకులు అమ్మవారి మూలవర్లను ఫల పంచామృతాలతో పాటు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకించారు. అనంతరం విభూది, పసుపుతో అమ్మవారిని అర్ధనారీశ్వరునిగా అలంకరించారు. పూజల అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.

March 30, 2026 / 10:26 AM IST

ఏప్రిల్ 1న పుష్పగిరి క్షేత్రాన గిరి ప్రదక్షణ

KDP: ఏప్రిల్ 1న పౌర్ణమి సందర్భంగా పుష్పగిరి క్షేత్రంలో గిరి ప్రదక్షణ ఉంటుందని శ్రీ పుష్పగిరి తీర్థ క్షేత్ర ధర్మ పరిరక్షణ సమితివ్య వస్థాపక అధ్యక్షుడు సట్టి భారవి తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తులు ఉదయాన్నే గిరి ప్రదక్షణ చేయాలన్నారు. విచ్చేసే భక్తులకు దాతల సహకారంతో తాగునీరు, మజ్జిగ, అల్పాహారం ఏర్పాటు చేయనుట్లు చెప్పారు.

March 30, 2026 / 10:25 AM IST

నేడు నరసాపురం మున్సిపాలిటీలో బహిరంగ వేలం

W.G: నరసాపురం పురపాలక సంఘం పరిధిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రకాల ఫీజుల వసూలు హక్కుల కోసం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఆర్.రామిరెడ్డి తెలిపారు. ఈ వేలం ప్రక్రియ 30న సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభమవుతుందన్నారు. సదరు పాటదారులు అందరూ బహిరంగ వేలంలో పాల్గొనవలసిందిగా కమిషనర్ కోరారు.

March 30, 2026 / 10:22 AM IST

నేడు నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమం

SKLM: జి.సిగడాం మండలం చెట్టుపొదిలాం గ్రామంలో ఇవాళ సాయంత్రం ‘నమస్తే ఎచ్చెర్ల’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెదేపా మండల అధ్యక్షుడు కుమరాపు రవికుమార్ తెలిపారు. ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు హాజరై ప్రజా సమస్యలకు సంబంధించి వినతులు స్వీకరించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. గ్రామంలోని సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

March 30, 2026 / 10:20 AM IST

ర్యాలి జగన్మోహిని ఆలయాన్ని దర్శించిన దేవాదాయ కమిషనర్

కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారిని ఆదివారం సాయంత్రం  దేవాదాయ శాఖ కమిషనర్ వి సత్యనారాయణ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న వార్షిక కళ్యాణోత్సవాలను తిలకించారు

March 30, 2026 / 10:17 AM IST

నేడు మంత్రి దుర్గేష్ పర్యటన

E.G: మంత్రి కందుల దుర్గేష్ సోమవారం నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు పెరవలి మండలం నడుపల్లికోటలో ఎంపీపీ పాఠశాల భవన నిర్మాణ శంకుస్థాపన చేస్తారు. 10 గంటలకు పెరవలి మండలం మల్లేశ్వరంలో పశువైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. 11 గంటలకు నిడదవోలు మండలానికి మంజూరైన ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొంటారు

March 30, 2026 / 10:13 AM IST