గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్య సేవలు పొందుతూ శుక్రవారం పరారైన రిమాండ్ ఖైదీ అజయ్‌పై తెనాలి పోలీసులు 25 వేల రూపాయల పారితోషికం ప్రకటించారు. ఇప్పటికే ఖైదీ పరారీ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులను ఎస్పీ వకుల్ జిందాల్ సస్పెండ్ చేశారు. అజయ్ అలియాస్ భీముడు ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.