• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు ఈ గ్రామాలకు విద్యుత్ సరఫరా బంద్

SKLM: సంతబొమ్మాళి మండల విద్యుత్ వినియోగదారులకు రేపు 33/11 KV నౌపడ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు EE నరసింహ కుమార్ తెలిపారు. కొత్త బ్రేకర్ ఏర్పాటు, కొత్త లైన్ పనులు జరుగుతున్నందున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 33/11 KV నౌపడ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని నౌపడ, హనుమంతు నాయుడుపేట, మూలపేట, మేఘవరం, భావనపాడు పంచాయతీలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

March 23, 2026 / 11:08 AM IST

మోసురు శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి

PPM: పాచిపెంట మండలం మోసురులో నూతనంగా నిర్మించిన శివాలయం ప్రతిష్ఠ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థుల ఆహ్వానం మేరకు హాజరైన సంధ్యారాణి జ్యోతి వెలిగించి శివలింగం ప్రతిష్ఠ పూజలు ప్రారంబించారు. అయితే రాత్రి ‘రేలా రే రేలా’, రేపు పల్సర్ బైక్ రమణ బృందంతో పోగ్రామ్ జరగనున్నాయి.

March 23, 2026 / 11:07 AM IST

కారంపూడిలో సీపీఐ ధర్నాకు పిలుపు

పల్నాడు: కారంపూడి మండలం ఆదినారాయణ కాలనీలో సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 24న తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, నిరుద్యోగ భృతి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. రేపు జరిగే ధర్నాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

March 23, 2026 / 11:04 AM IST

భాజపా పార్టీ బలోపేతంపై ప్రశిక్షణ కార్యక్రమం

E.G: కడియంలో ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్’ సమారోప్ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా భాజపా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర పాల్గొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం, ప్రశిక్షణకు సంబంధించిన పలు అంశాలు, ప్రాధాన్యత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

March 23, 2026 / 11:00 AM IST

ఈనెల 27న ట్రాక్టర్ రివర్స్ పోటీలు

ATP: గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఈనెల 27న ట్రాక్టర్ రివర్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారికి వరుస బహుమతులుగా రూ.5 వేలు, రూ.3వేలు, రూ.వెయ్యి ఇస్తారన్నారు. ఈ అవకాశన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 23, 2026 / 11:00 AM IST

కాణిపాకంలో ఈనెల 26న హుండీ లెక్కింపు

CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి హుండీని ఈనెల 26వ తేదీన లెక్కించనున్నట్లు ఆలయ ఈవో పెంచల కిశోర్ తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. హుండీ లెక్కింపు ప్రక్రియలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

March 23, 2026 / 10:49 AM IST

‘ఖేలో ఇండియా’లో అనకాపల్లి జట్ల రాణింపు

AKP: కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి ‘ఖేలో ఇండియా’ రగ్బీ పోటీల్లో జిల్లా జట్లు ప్రతిభ కనబరిచాయి. సీనియర్స్ జట్టు ద్వితీయ స్థానం, జూనియర్స్ జట్టు తృతీయ స్థానం సాధించాయి. లీగ్ దశలో వరుస విజయాలతో ఫైనల్, సెమీఫైనల్ వరకు చేరినట్లు కోచ్ వెంకట్ తెలిపారు. జట్ల ప్రదర్శనపై అధ్యక్షుడు కుండ్రపు వెంకునాయుడు, అసోసియేషన్ సభ్యులు క్రీడాకారులను అభినందించారు.

March 23, 2026 / 10:47 AM IST

‘కుడిపూడి మరణం పార్టీకి తీరని లోటు’

కోనసీమ: ఆలమూరు మండలం పెదపళ్ల జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు కుడుపూడి దుర్గాప్రసాద్ అకాల మరణం పార్టీకి తీరని లోటని జనసేన పార్టీ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు. ఇవాళ దుర్గాప్రసాద్ మృతి చెందినట్లు తెలిసిన వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. పార్టీకి ఎంతో అండదండగా ఉండే దుర్గాప్రసాద్ లాంటి వ్యక్తి ని కోల్పోవడం దురదృష్టకరమన్నారు.

March 23, 2026 / 10:46 AM IST

ఎస్టీ కమిషన్ అధికారిక పర్యటన ప్రారంభం

PPM: రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జి రెడ్డి, సభ్యులు కడ్రక మల్లేశ్వరరావు, గొర్లే సునీత నేటి నుంచి 26 వరకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నాలుగు రోజుల అధికారిక పర్యటన ప్రారంభించారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి, శ్రీకూర్మం దేవాలయాలను సందర్శించిన అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

March 23, 2026 / 10:45 AM IST

‘ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది’

ప్రకాశం: టంగుటూరు మండల వైసీపీ అధ్యక్షుడు హరిబాబు కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో దగా క్యాలండర్ విడుదల చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన హరిబాబు యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నేడు జరిగే మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు.

March 23, 2026 / 10:45 AM IST

పవన్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

W.G: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్, డెమోన్ పవన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల ఆయన తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతూ కన్నుమూశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా సోమవారం మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకులోని పవన్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

March 23, 2026 / 10:38 AM IST

ఆలయ సమీపంలోనే చెత్త కుప్పలు

PPM: పాలకొండ పట్టణంలోని ఎన్‌కే.రాజపురం రామాలయం సమీపంలోని ప్రధాన రహదారి చెత్తతో నిండిపోయి దుస్థితికి చేరుకుంది. రోజుల తరబడి వ్యర్థాలు పేరుకుపోవడంతో తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

March 23, 2026 / 10:37 AM IST

గవిగట్టులో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ..!

KRNL: పెద్దకడబూరు మండలంలోని గవిగట్టు గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నేతలు సోమవారం భూమిపూజ చేశారు. టీడీపీ నాయకులు ఉప్పర బసయ్య, మునిస్వామి, ఈరన్న, హనుమంతు, దాసప్ప, బజారి, బంగారయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలకు మహర్ధశ వచ్చిందన్నారు.

March 23, 2026 / 10:35 AM IST

మురుగు కాలువలోకి దూసుకెళ్లిన కారు

కోనసీమ: ఆలమూరులో ఇవాళ ఉదయం కారు అదుపు తప్పి మురుగు కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక శాంతి థియేటర్ మలుపు చర్చి వద్ద వేగంగా వచ్చిన కారు కాలువలోకి దూసుకెళ్లి, పక్కనే ఉన్న గోడను బలంగా ఢీ కొట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిందన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 23, 2026 / 10:34 AM IST

‘పన్ను వసూలులో నిర్లక్ష్యం వస్తే చర్యలు తప్పదు’

ELR: ఇంటి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని డి ఎల్ పి ఓ అమ్మాజీ హెచ్చరించారు. సోమవారం ఉంగుటూరు మండలం వెల్లమిల్లి నారాయణపురం బాదంపూడి గ్రామాల్లో ఆమె ఇంటి పన్ను వసూళ్లపై పరిశీలించారు. వెల్లమిల్లిలో అక్కడ పంచాయతీ, సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు ఉన్నారు.

March 23, 2026 / 10:33 AM IST