• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చిత్తూరు RWS ఎస్ఈగా ప్రసన్న కుమార్

CTR: గ్రామీణ నీటి సరఫరా (RWS) శాఖ ఎస్ఈగా ప్రసన్నకుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంతకుముందు అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఈఈగా పనిచేస్తున్న ఆయనకు ఎస్ఈగా ప్రమోషన్ వచ్చింది. దీంతో బదిలీపై చిత్తూరుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు కృషి చేస్తానన్నారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

September 4, 2025 / 02:10 PM IST

మిషన్ శక్తి – సంకల్ప అవగాహన కార్యక్రమం

GNTR: మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఫిరంగిపురం ఆధ్వర్యంలో గురువారం మార్నింగ్ స్టార్ కళాశాలలో మిషన్ శక్తి – సంకల్ప అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీడీపీవో ఎం. అనురాధ మాట్లాడుతూ.. లింగ సమానత్వం , ప్రధాన మంత్రి కౌశల్ యోజన గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.

September 4, 2025 / 02:04 PM IST

‘నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించుకోవాలి’

KRNL: కర్నూలులో వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం రాంబొట్ల ఆలయంలో గణేశుడిని దర్శించి పూజలు నిర్వహించిన ఎంపీ బైరెడ్డి శబరి, కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యేలు చరితారెడ్డి, పార్థసారథి, శ్యామ్బాబు, మేయర్ రామయ్య, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు.

September 4, 2025 / 02:01 PM IST

ఫ్లెక్సీ యజమానులను హెచ్చరించిన డీఎస్పీ

కోనసీమ: ఫ్లెక్సీ లపై వివాదాస్పద రాతలు రాస్తే చర్యలు తప్పవని అమలాపురం డీఎస్పీ టిఎస్ఆర్‌కె.ప్రసాద్ హెచ్చరించారు. అమలాపురం రూరల్ సీఐ కార్యాలయంలో ఇవాళ ఫ్లెక్సీ యజమానులతో సమావేశం అయ్యి పలు సూచనలు చేశారు. సూచనలు కచ్చితంగా పాటించాలని లేనిచో చర్యలు తప్పవని అన్నారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.

September 4, 2025 / 02:00 PM IST

‘ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి’

NDL: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్ రెడ్డిపై చేసిన వాక్యాలు అనుచితమని జిల్లా సహాయ కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంఘం నాయకులపై బెదిరింపు ధోరణి సరికాదని ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు బాషా తదితరులు పాల్గొన్నారు.

September 4, 2025 / 01:57 PM IST

టీటీడీ‌కి శశి విద్యాసంస్థలు భారీ విరాళం

TPT: టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు శశి విద్యాసంస్థలు రూ.1,11,11,111 విరాళం అందించారు. ఈ మేరకు గురువారం ఉదయం టీటీడీ ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో ఛైర్మన్ బీఆర్ నాయుడుని కలిసి విరాళం డీడీని శశి విద్యాసంస్థలు అధినేత బురుగుపల్లి రవికుమార్ అందజేశారు. అనంతరం దాత రవికుమార్ దంపతులను ఛైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు.

September 4, 2025 / 01:50 PM IST

15 లక్షల వ్యయంతో డి.అగ్రహారంలో సీసీ రోడ్డు ఏర్పాటు

KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని రేకలకుంట పంచాయతీ పరిధి డి.అగ్రహారం గ్రామంలో 340 మీటర్ల సిసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ మేరకు 15 లక్షల వ్యయంతో నిర్మించబడుతున్న ఈ రహదారి పనులను మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు, మండల అధ్యక్షులు చెన్నుపల్లె సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కనాల మల్లికార్జున, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

September 4, 2025 / 01:47 PM IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్‌ ప్రారంభం

VZM: చీపురుపల్లి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా రెండో కంప్యూటర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ డా.పీ.వీ.కృష్ణాజి తెలిపారు. కళాశాలలో గల కంప్యూటర్ సైన్సు కోర్సులో చదువుతున్న విద్యార్దులకు ఉపయోగపడేలా ఈ అత్యాదునిక కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంబించామని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో కంప్యూటర్ నేర్చుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు.

September 4, 2025 / 01:46 PM IST

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వాగతం పలికిన ఎస్పీ

VSP: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఉన్న దామోదరం సంజీవయ్య యూనివర్సిటీని గురువారం సందర్శించారు. ఆయన పర్యటనలో సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

September 4, 2025 / 01:43 PM IST

సుప్రభాత సేవలో సినీనటుడు

TPT: సినీనటి, నటుడు వరుణ్ సందేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని గురువారం వేకువజామున సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు.

September 4, 2025 / 01:38 PM IST

టెంపుల్ సిటీ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో

TPT: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తిరుపతిలో సెప్టెంబర్ 5వ తేదీ నుండి మూడు రోజుల పాటు ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్లను తిరుపతి కార్యాలయంలో విడుదల చేశారు. కాగా, ఈ షో కొత్త టెక్నాలజీలు, ఉత్పత్తులు ప్రజలకు, బిల్డర్లకు పరిచయం చేస్తుందని క్రెడాయ్ TPT ప్రెసిడెంట్ రామప్రసాద్ చెప్పారు.

September 4, 2025 / 01:27 PM IST

సింగల్ విండో కార్యాలయాన్ని సందర్శించిన ఆర్డీవో

సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయాన్ని పెనుకొండ ఆర్డీవో ఆనంద్ కుమార్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులకు పంపిణీ చేస్తున్న యూరియా మూటలను ఆర్డివో దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం సింగిల్ విండో ఛైర్మన్ వెంకటేశులతో మాట్లాడి స్టాక్ ఎంత వచ్చింది, రైతులకు ఏ విధంగా యూరియా అందిస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు.

September 4, 2025 / 01:24 PM IST

జిల్లాలో రూ.100 కోట్ల స్కాం: సోమిరెడ్డి

NLR: జిల్లాలో ఇళ్ల నిర్మాణాల పేరుతో రూ.100కోట్ల మేరకు అవినీతి జరిగిందని విజిలెన్స్ ఎంక్వయిరీ వేస్తే అక్రమాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం అన్నారు. గత ప్రభుత్వంలో ఇల్లు కట్టకుండానే బిల్లులు చేసుకున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలోనూ బిల్లులు మంజూరు అయ్యాయని చెప్పారు.

September 4, 2025 / 01:24 PM IST

‘మోటార్ ఆటో డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలి’

VZM: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మోటారు ఆటో డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏఐటీయూసీ నాయకులు పురం అప్పారావు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం గజపతినగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద మోటార్ ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ‘స్త్రీ శక్తి’ పథకం వలన అర్ధాకలితో జీవిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

September 4, 2025 / 01:21 PM IST

చిత్తూరు జిల్లాకు నిధుల మంజూరు

CTR: జిల్లాలో 697 పంచాయతీలకు గాను 667కు నిధులు మంజూరు అయ్యాయి. 16వ ఆర్థిక సంఘం కింద కేంద్రం రూ.29.78 కోట్లు రిలీజ్ చేసింది. ఈ మేరకు ఈ రికార్డులు పూర్తి చేయకపోవడంతో 17 పంచాయతీలు, ఎన్నికలు జరగకపోవడంతో మరో 13 పంచాయతీలకు నిధులు రాలేదు. దీంతో టైడ్ నిధులను పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉంటుంది.

September 4, 2025 / 01:21 PM IST