• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మినీ లారీ బోల్తా.. వ్యక్తికి తీవ్ర గాయాలు

BPT: అద్దంకి వద్ద మినీ లారీ బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. టోల్ ప్లాజా సిబ్బంది, అద్దంకి పోలీసులు కలిసి లారీని రోడ్డుపై నుంచి తొలగించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

March 25, 2026 / 08:44 AM IST

ఇసుక లారీ బోల్తా.. డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు

NDL: కొలిమిగుండ్ల గ్రామ సమీపంలోని గ్యాస్ గోడౌన్ వద్ద ఇవాళ ఇసుక లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలు కాగా.. చికిత్స కోసం అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నడిరోడ్డుపై లారీ బోల్తా పడటంతో రోడ్డుకి ఇరువైపుల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.

March 25, 2026 / 08:43 AM IST

తాగునీటి పైప్‌లైన్ లీకేజ్‌కు మరమ్మత్తు పనులు

ATP: పామిడి నుంచి గుత్తి మున్సిపాలిటీకి తాగునీటి సరఫరా చేసే సత్యసాయి తాగునీటి పైప్‌లైన్ లీకేజీ కావడంతో బుధవారం పైప్‌లైన్ లీకేజ్‌కు మున్సిపాలిటీ సిబ్బంది మరమ్మత్తు పనులు చేపట్టారు. దీంతో గుత్తి మున్సిపాలిటీకి రెండు రోజులు పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా తెలిపారు.

March 25, 2026 / 08:42 AM IST

శ్రీకాకుళం మీదుగా అమృత్ భారత్ ట్రైన్

శ్రీకాకుళం రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. శ్రీకాకుళం మీదుగా చర్లపల్లి-సాలిమార్-చర్లపల్లి(17065/66)మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రైలు సర్వీసులు ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని జిల్లాలో శ్రీకాకుళం రోడ్, పలాస రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగనుందని రైల్వేశాఖ తెలిపింది.

March 25, 2026 / 08:42 AM IST

నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 10 గంటలకు గొల్లవెల్లి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. 11 గంటలకు ఉప్పలగుప్తంలో ఆత్మ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. 12 గంటలకు భీమనపల్లి గ్రామంలో ఆర్అండ్‌బీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.

March 25, 2026 / 08:41 AM IST

రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రగడ

ప్రకాశం: ఒంగోలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మంగళవారం రిజిస్ట్రార్‌పై పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి కార్యాలయంలో వీరంగం సృష్టించాడు. తనపై ఉన్న జీపీఏను రద్దు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనపై ఉన్న జీపీఏను తనకు తెలియకుండా ఎలా రద్దు చేస్తారంటూ దూషణలకు దిగినట్లు సమాచారం. నిబంధనల ప్రకారమే జీపీఏను రద్దు చేసినట్లు రిజిస్టర్ కార్యాలయం అధికారులు తెలిపారు

March 25, 2026 / 08:40 AM IST

రూ. 44కోట్లతో 150 ఆయుష్ ఆరోగ్య కేంద్రాలు: మంత్రి

కృష్ణా: రాష్ట్రంలో రూ. 44 కోట్లతో 150 ఆయుష్ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ మంగళవారం విజయవాడలోని తన కార్యాలయంలో వెల్లడించారు. 2 నెలల్లోగా ఈ కేంద్రాలను ప్రారంభించడానికి కార్యచరణ చేపట్టామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వీటి ఏర్పాటుతో పేదలకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయన్నారు.

March 25, 2026 / 08:40 AM IST

బండలాగుడు పోటీల్లో ప్రొద్దుటూరు విజయం

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి ఉత్సవాల్లో బండలాగుడు పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ప్రొద్దుటూరుకు చెందిన చంద్ర ఓబులరెడ్డి వృషభాలు ప్రథమ స్థానం సాధించి యూనికార్న్ బైక్ గెలుచుకున్నాయి. గన్నవరం ఎడ్లు రూ.లక్ష, సూర్యాపేట ఎడ్లు రూ.80 వేలు, పెద్దకొట్టాల ఎడ్లు రూ.60 వేల బహుమతులు పొందాయి. విజేతలకు ఛైర్మన్లు పీవీ కుమార్ రెడ్డి మంగళవారం బహుమతులు అందజేశారు.

March 25, 2026 / 08:37 AM IST

‘పామాయిల్ మిల్లులను ఆధునీకరించాలి’

E.G: APలోని పామాయిల్ ప్రాసెసింగ్ మిల్లులను ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని MP పురంధేశ్వరి కోరారు. దేశంలోనే పామాయిల్ సాగు APలో అధికమని పేర్కొన్నారు. ప్రభుత్వ, సహకార మిల్లుల్లో పాత పద్ధతుల వల్ల నూనె దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారని వివరించారు. మిల్లులను ఆధునీకరించడం ద్వారా దిగుబడి పెరిగి రైతులకు లాభదాయకమైన ధర లభిస్తుందని ఆమె స్పష్టం చేశారు.

March 25, 2026 / 08:36 AM IST

తడిచిన మిర్చి పంటను పరిశీలించిన ఎమ్మెల్యే

PLD: అమరావతిలో అకాల వర్షానికి తడిచిన మిర్చి పంటను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పరిశీలించారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు రాజశేఖర్ యాదవ్, చిలకా నాగలక్ష్మితో పాటు పలువురు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొని రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

March 25, 2026 / 08:36 AM IST

నెల్లూరులో యువకుడి మృతి

నెల్లూరులో ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. అయ్యప్ప గుడి సమీపంలోని ఓ మెడికల్ షాప్ పక్కన యువకుడి మృతదేహాన్ని స్థానికులు మంగళవారం గుర్తించి వీఆర్వోకు సమాచారం ఇచ్చారు. ఆయన ఘటనా స్థలానికి వెళ్లారు. అదే సమయంలో మృతుడి జేబులోని సెల్ ఫోన్ మోగింది. వీఆర్వ్ కాల్ మాట్లాడగా.. ఆ ఫోన్ తన తమ్ముడు కమలాకర్ (37)ది అని తమది నంద్యాల అని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 25, 2026 / 08:35 AM IST

పేలిన బస్సు టైరు.. 10 మందికి గాయాలు

నంద్యాల జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం తప్పింది. చాబోలు హైవేపై మార్నింగ్ స్టార్ బస్సు టైరు పేలడంతో అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. పోలీసులు చేరుకుని వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులను సురక్షితంగా నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌కు చేర్చారు.

March 25, 2026 / 08:31 AM IST

మున్సిపాలిటీలో పెరగనున్న వార్డుల సంఖ్య

AKP: ఎలమంచిలి మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెరగనుంది. జనాభా ప్రాతిపదికన వార్డులను విభజించి కొత్త వార్డులను ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎలమంచిలి మున్సిపాలిటీలో 46,732 జనాభా ఉండగా ప్రస్తుతం 56,000 జనాభా ఉంది. దీంతో 25 వార్డుల సంఖ్య 36కు పెరిగే అవకాశం ఉంది.

March 25, 2026 / 08:29 AM IST

జీవీఎంసీలో వార్డుల పెంపు దిశగా అడుగులు

VSP: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వార్డుల సంఖ్య సవరణకు సిద్ధమైంది. 15 లక్షలకు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్‌లలో గరిష్ఠంగా 120 వార్డులు ఉండేలా నిర్ణయించింది. ప్రస్తుతం 98 వార్డులు ఉన్న జీవీఎంసీలో జనాభా 24 లక్షలు దాటడంతో వార్డులు పెరిగే అవకాశం ఉంది.

March 25, 2026 / 08:23 AM IST

యూటీఎఫ్ నిరాహార దీక్షకు ఏపీ ఎన్జీవోల సంఘీభావం

SS: కదిరి యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చేపట్టిన నిరాహార దీక్షకు ఏపీ ఎన్జీవో తాలూకా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, పెన్షనర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఆత్మరెడ్డి సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ డివిజన్ నాయకులు బాషా, ఓబులేసు కూడా మద్దతు ప్రకటించారు. యూటీఎఫ్ ఉద్యమాలకు మరింత శక్తినిచ్చేలా వారు సమావేశంలో ప్రసంగించారు.

March 25, 2026 / 08:18 AM IST