SS: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మంత్రి సవితను శనివారం తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత వారి సమస్యలను విని, వాటి పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
KRNL: ఆస్పరి మండలం కైరుప్పలలో ఉగాది సందర్భంగా నిర్వహించిన సాంప్రదాయ పిడకల ఆట ప్రశాంతంగా ముగిసిందని పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య ఇవాళ పేర్కొన్నారు. వేడుకల్లో ఎవరికి గాయాలు కాలేదని వివరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ముందస్తుగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి కార్యక్రమం సజావుగా జరిగేలా పోలీసులు చర్యలు తీసుకునరని వెల్లడించారు.
W.G: మండల కేంద్రం అయిన ఉండి రాజులపేటలోని శ్రీ పార్వతి సమేత చెన్నమల్లేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు, కాలభైరవ స్వామి విగ్రహాల ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఇవాళ జరిగింది. ఆలయ అర్చకులు సన్నిధిరాజు కృష్ణ చలపతి శేషగిరి, సుబ్బారావు ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అఖండ అన్న సమారాధన జరిపారు.
KDP: వల్లూరు, తోలగంగనపల్లి, దిగువపల్లి, పెద్దపుత్త గ్రామాల్లో ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. స్థానిక మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఖురాన్ బోధనలు విన్నారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుని, పేదలకు దానధర్మాలు చేశారు. బంధుమిత్రులతో కలిసి విందుల్లో పాల్గొన్నారు.
ATP: నార్పల(మం) బీ. పప్పూరు గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే బండారు శ్రావణి శనివారం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రూ.42 లక్షలతో 56 మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోందని ఆమె తెలిపారు. శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
SKLM: కేంద్ర మాజీ మంత్రి శ్రీమతి డా. కిల్లి కృపారాణి శనివారం హైదరాబాద్‌లో జరిగిన మాజీ సీనియర్ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ కావూరి సాంబశివరావు సంస్మరణ సభలో మాట్లాడారు. సాంబశివరావు గారు రాజకీయ జీవితంలో అనేక పదవులు నిర్వహించారన్నారు. ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ హైదరాబాద్‌లో సంస్మరణ సభకు హాజరు కావడం ఆనందంగా ఉందని తెలిపారు.
VZM: సీఎం సహాయానిది పేదల పాలిట వరం అని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.6,33,528/- ల విలువల గల చెక్కులను జిల్లాకు చెందిన 6 మంది లబ్దిదారులకు శనివారం ఎమ్మెల్యే వారి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా తమకు ఆర్ధిక సహాయం అందించినందుకు ఎమ్మెల్యేకు, సీఎం చంద్రబాబుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
PLD: గ్రామాల్లో వర్గపోరాటాలకు చెక్ పెట్టి, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిస్తూ రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో నెలకొన్న వివాదాన్ని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పరిష్కరించారు. ఇరువర్గాలను ఒకేచోటకు తీసుకువచ్చి, రాజకీయాలకు అతీతంగా చర్చలు జరిపి రాజీ కుదిర్చారు.
KRNL: ఆదోనిలో పలు వార్డుల నుంచి ముస్లిం సోదరులు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఇంటి వద్దకు చేరుకుని ఇవాళ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పరస్పర ప్రేమ, ఐక్యతను ప్రతిబింబించేలా ఆత్మీయంగా కలుసుకున్నారు. సౌభ్రాతృత్వ వాతావరణంలో జరిగిన ఈ సమావేశం సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలిచిందని అధ్యక్షురాలు పేర్కొన్నారు.
కోనసీమ: అల్లవరం మండలం ఓడలరేవులో శుక్రవారం మధ్యాహ్నం సముద్ర స్థానానికి దిగి గల్లంతైన అమలాపురంకి చెందిన ఇంటర్ విద్యార్థి దొమ్మేటి లోకేష్ మృతదేహం శనివారం లభ్యమైంది. మెరైన్ పోలీసులు లోకేష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా, మృతదేహాన్ని శనివారం గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
VSP: భీమిలి తీరంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఐదు నక్షత్రాల ‘హయత్ సెంట్రిక్’ హోటల్ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్ట్ర్ హరేందిర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
KDP: మైదుకూరు పట్టణం మార్కెట్ యార్డ్ వద్ధ ఇవాళ ఒకవైపు పశువుల సంత నిర్వహణ జరుగుతుండగా, అదే సమయంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఒకేరోజు ఒకే సమయంలో జరుగుతున్న నేపథ్యంలో జనసంచారం అధికంగా ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు, ముస్లిం సోదరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
CTR: నగరి ప్రాంతానికి చెందిన మూసా బాయ్ నివాసంలో మాజీ మంత్రి రోజా శనివారం రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఆనందాన్ని పంచుకున్న ఆమె, అందరికీ హృదయపూర్వక ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం పవిత్రత మనిషిలో సహనం, దాతృత్వం, క్షమా వంటి విలువలను పెంపొందిస్తుందని ఆమె పేర్కొన్నారు.
NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారికి భక్తులు తమ భక్తిశ్రద్ధలను చాటుకుంటున్నారు. ఈ క్రమంలో విజయవాడ రామచంద్ర నగర్‌కు చెందిన శ్రీ దేవి శ్రీ రమ్య కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి విలువైన బంగారు లక్ష్మీ హారాన్ని శనివారం సమర్పించారు. రాళ్లు పొదిగిన ఈ హారం సుమారు 42 గ్రాముల బరువుతో ఉండి, దాని విలువ దాదాపు రూ. 6,35,000 ఉంటుందన్నారు.
ప్రకాశం: పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామ సమీపంలో వెలిసిన గొడ్రాలికొండ తిరుమలనాథస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం నాలుగున్నర గంటలకు అభిషేకం, ఐదు గంటలకు అలంకరణ, ఐదున్నర గంటలకు నిత్య పూజా కార్యక్రమలు చేశారు విష్ణు సహస్రనామ స్తోత్రం, లలిత సహస్రనామ స్తోత్రం, భగవద్గీత శ్లోకాలు పారాయణ అనంతరం భజన చేశారు.