ELR: హైదరాబాద్‌లో డ్రగ్స్ సంబంధిత వ్యవహారంలో తన పేరు రావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఏలూరు MP పుట్టా మహేశ్ కుమార్ పేర్కొన్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదనే విషయాన్ని, ఎంపీగా గెలిపించిన ప్రజలకు, పార్టీ అధిష్ఠానానికి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘విచారణలో నేను నిర్దోషిగా బయటకు వస్తా’ అని పేర్కొన్నారు.
VZM: మెరకముడిదాంలోని 17మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులకు, 274 వార్డు మెంబర్లకు LSDG పై ఇవాళ ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఉదయం 10 నుంచి 5 వరకు నిర్వహిస్తున్నట్ల స్థానిక MPDO భాస్కరరావు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సమ్మిళిత ఆర్ధికాభివృద్ధి లక్ష్యాలపై సభ్యులందరూ ఆవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ శిక్షణకు సభ్యులందరూ హాజరుకావలసిందిగా కోరారు.
AKP: ఈనెల 15వ తేదీన నిర్వహించిన అక్షరాంధ్ర పరీక్షలో శత శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వయోజన విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 93,292 మంది వయోజనలు ఈ పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు ముందు వీరికి మూడు నెలల పాటు రాయడం, చదవడం, లెక్కలు చేయడం నేర్పించినట్లూ అధికారులు పేర్కొన్నారు. సోమవారం వయోజన విద్యాశాఖ అధికారులు ఫలితాలను విడుదల చేశారు.
GNTR: తెనాలి మండలం కట్టేవరంలో జనసేన పార్టీ జెండా ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో గ్రామంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. పార్టీ గుర్తును, జెండాను అవమానించేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన నాయకుడు రామకృష్ణ సోమవారం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాధ్యులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.
GNTR: తెనాలిలో సోమవారం రాడ్ బెండింగ్ కార్మికుడు నరేంద్ర ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఆత్మహత్య చేసుకున్నాడని భార్య ఫిర్యాదు చేసినప్పటికీ, ఘటనా స్థలాన్ని పరిశీలించిన టూ టౌన్ పోలీసులు దీనిని అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు. ఈ క్రమంలో మృతుడి భార్యతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, అతని మృతికి గల వివరాలు తెలియాల్సి ఉంది.
W.G: పాలకోడేరు మండలంలోని కొండేపూడి శివారు వరి పొలాల్లో సోమవారం పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. కొండేపూడి శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో దాడి చేసి 8 మంది జూదరులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.4,200 నగదు స్వాదీనం చేసుకున్నట్లు ఎస్సై రవి వర్మ తెలిపారు.
ASR: గూడెం కొత్తవీధి మండలంలోని పెదవలస, దుచ్చరిపాలెం, గాలికొండ, అడగరపల్లి, శంకాడ కొత్తూరు, బూరుగుపాకలు, అసరాడ, కొడిసింగి, బోనంపల్లి తదితర గ్రామాల్లో సోమవారం రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించామని ఏవో డీ.గిరిబాబు తెలిపారు. స్వర్ణాంధ్ర-2047, నీటి భద్రత, సాగు పద్ధతులు, వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.
SKLM: కొత్తూరు మండల ఉపాధి కార్యాలయం ఆవరణలో ఇవాళ ప్రజావేదిక జరగనుంది. రెండు వారాలుగా మండలంలోని 43 పంచాయతీల్లో సామాజిక తనిఖీలు పూర్తి చేసినట్లు ఏపీవో ప్రేమలత తెలిపారు. తనిఖీల్లో తేలిన అంశాలను బహిరంగంగా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, నాయకులు, ఉపాధి కూలీలు అంతా హాజరు కావాలని కోరారు.
కడప: నగరంలోని 12వ డివిజన్ కార్పొరేటర్ సానపు రెడ్డి శివకోటి రెడ్డి సోమవారం రాత్రి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే పలువురు వైసీపీని వీడి టీడీపీలోకి చేరుతున్నారు. దీంతో వైసీపీ అక్కడ డైలమాలో పడింది.
PPM: గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంద్యారాణి సాలూరులో సోమవారం రాత్రి ముస్లింలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మత సామరస్యానికి, సోదర భావానికి రంజాన్ ప్రతిక అని అన్నారు. ఈ పవిత్ర రంజన్ మాసం ముస్లింలకు ఎంతో ప్రత్యేకమని, ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసారు.
సత్యసాయి: యువత భవిష్యత్తు, ప్రాణరక్షణే ప్రభుత్వ ప్రాధాన్యతని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పేర్కొన్నారు. మడకశిరలో “డ్రగ్స్ వద్దు – హెల్మెట్ ముద్దు” నినాదంతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ సతీష్ కుమార్, సినీ తారలు శ్రీవిష్ణు, హెబ్బా పటేల్ పాల్గొన్నారు. హెల్మెట్ ధరించకపోతే కుటుంబాలు రోడ్డున పడతాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణా: పెనమలూరు మండలం తాడిగడప ఆర్టీసీ కాలనీలో రూ.1.50 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరంకి ప్రజలు నన్ను నమ్మి మీ బిడ్డగా ప్రతి ఎన్నికలలో అండగా నిలబడి, గెలిపించినందుకు మీరు గర్వపడేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు.
ప్రకాశం: తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలోని ZP హై స్కూల్‌లో 3 దశాబ్దాల విద్యార్థులకు చెందిన విలువైన డాక్యుమెంట్స్ ఉన్న ఎలాంటి సెక్యూరిటీ లేదని విద్యాశాఖ అధికారులపై కాంగ్రెస్ మైనార్టీ ఛైర్మన్ డా. షేక్ మహబూబ్ వలి మండిపడ్డారు. సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో జేసీకి వినతి పత్రం ఇచ్చారు. స్కూలుకు సంబంధం లేని వ్యక్తులు పాఠశాలలో సంచరిస్తున్నారన్నారు.
SKLM: మందస మండలం హరి పురం రైల్వే స్టేషన్ సమీపంలో ఎస్సై కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తిని తనిఖీ చేయగా, అతని వద్ద నుంచి 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
NDL: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల మొదటి రోజు శ్రీస్వామి అమ్మవార్లు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అలంకార మండపంలో ప్రత్యేక పూజలు అందుకున్న ఉత్సవమూర్తులకు వైభవంగా గ్రామోత్సవాన్ని జరిపించారు. గ్రామోత్సవం ముందు వివిధ కళారూపాల ప్రదర్శన భక్తులను ఎంతగానో అలరించింది.