CTR: పలమనేరు ఆర్టీసీ బస్టాండ్‌లో గంటావూరుకు చెందిన రహమత్ బేగం ప్రమాదవశాత్తు ఆదివారం బస్సు కిందపడి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. గాయపడిన వృద్ధురాలికి పలమనేరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. సోమవారం ఆమె మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
SKLM: కొత్తూరు మండల కేంద్రంలో ‘రైతన్న మీ కోసం’ కార్యక్రమాన్ని లోతుగెడ్డ తులసీ వర ప్రసాద్ రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుసరించాలని రైతులకు సూచించారు. రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. APAIMS 2.0 యాప్ ద్వారా పంటల వివరాలు, మార్కెట్ ధరలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
TPT: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తామని టీటీడీ ఛైర్మెన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈనెల 27 నుంచి ఏప్రిల్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. ఏప్రిల్ 1న జరిగే సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. కల్యాణ వేదిక ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
NDL: బనగానపల్లె(M) నందవరం చౌడేశ్వరి క్షేత్రంలో ఉగాది ఉత్సవాలకు భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని మాజీ సర్పంచ్ BC రాజారెడ్డి సూచించారు. సోమవారం బనగానపల్లెలో ఆలయ కమిటీ ఛైర్మన్ పివి కుమార్ రెడ్డి, తదితరులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఉత్సవ ఆహ్వాన పత్రికను అందజేసి స్వామివారి ఆశీస్సులు అందించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజారెడ్డి కోరారు.
ELR: ఉంగుటూరు మండలంలో మొదటి రోజు సోమవారం జరిగిన పదవ తరగతి తెలుగు పరీక్షలకు 26 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఉంగుటూరు ఎంఈవో- 1 సాయిబాబా తెలిపారు. మండలంలో ఐదు పరీక్షా కేంద్రాలలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు 692 మందికి 666 మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. మొదటిరోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు.
KRNL: కర్నూలు మం. దేవమాడ గ్రామంలో నిర్వహించిన రైతన్నా- మీకోసం, పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమంలో కోడుమూరు MLA దస్తగిరి పాల్గొన్నారు. రైతుల ఖాతాల్లో మూడవ విడత నిధులు జమ చేసిన సందర్భంగా డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాయని పేర్కొన్నారు.
సత్యసాయి: సోమందేపల్లి మండలంలో ఈనెల 20న శ్రీ చౌడేశ్వరి మాత పంచమ జ్యోతుల మహోత్సవం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ ధర్మకర్త ఈశ్వరయ్య సోమవారం మండల ఎస్సై రమేశ్ బాబును మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వానించారు. జ్యోతుల మహోత్సవం వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయనను కోరారు.
ATP: రంజాన్ మాసం క్రమశిక్షణకు మారుపేరు అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు పేర్కొన్నారు. మాజీ గ్రంథాలయ ఛైర్మన్ గౌస్ మోద్దిన్ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు రంజాన్ తోపా కింద చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగరాజు.. పేదలకు సేవ చేయడం అభినందనీయమన్నారు. మత పెద్దల ప్రత్యేక ప్రార్థనల అనంతరం మహిళలకు వస్త్రదానం నిర్వహించారు.
E.G: గోకవరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి బదిలీపై వచ్చిన డాక్టర్ జీ.వైశాలి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి తిరిగి క్యాన్సర్ సర్వే నిర్వహించాలని ఆమె ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు పరీక్షలు చేయించుకుని డాక్టర్ల సలహాలు పాటించాలని సూచించారు. మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
WG: ఆచంట మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. కూటమి నాయకులు, అధికారులు ఇంటింటికీ వెళ్లి పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల అమలుపై ఆరా తీశారు. సాగునీటి భద్రత, యంత్రీకరణ, మద్దతు ధర వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సర్వేలో తహసీల్దార్ బి. సోమేశ్వరరావు, ఎంఏవో బి. నాగరాజు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
విశాఖపట్నం కలెక్టరేట్ వీసీ హాలులో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అమరజీవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొని పొట్టి శ్రీరాముల సేవలను స్మరించుకున్నారు.
AKP: నాతవరం మండలం ఎం.బెన్నవరం సచివాలయాన్ని డిప్యూటీ ఎంపీడీవో ఏ.కూర్మారావు సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు, మూమెంట్ రిజిస్ట్రర్‌ను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు తక్షణ సేవలు అందించాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
KDP: అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా కడప జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన 58 రోజుల నిరాహార దీక్ష, ప్రాణత్యాగం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని డిప్యూటీ లైబ్రేరియన్ పవన్ కుమార్ కొనియాడారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ రాజ్ కుమార్, సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.
KNRL: పెద్దకడబూరులోని SC కాలనికి ఫిల్టర్ చేయని కలుషిత త్రాగునీరు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్, RWS ఏఈపై చర్యలు తీసుకోవాలని మంత్రాలయం మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బొగ్గుల తిక్కన్న డిమాండ్ చేశారు. MPDO ప్రభావతికి ఫిర్యాదు చేశారు. కాలనికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి ఫిల్టర్ చేయని నీరుసరఫరా చేయడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు.