• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేడు వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ

KDP: జడ్పీ సీఈవో ఓబులమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మంగళవారం నుంచి ట్రై సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 35 మండలాలకు 510 ట్రై సైకిళ్లను అందించనున్నారు. మండలాల్లో ఉండే డిప్యూటీ ఎంపీడీవోలకు మండల హెడ్ క్వార్టర్‌లో నేరుగా వీటిని అందిస్తారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.

March 17, 2026 / 07:12 AM IST

కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన ఎస్పీ

KRNL: ఆదోని వన్డేన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రామకృష్ణను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం సస్పెండ్ చేశారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గార్డెనియా విల్లాస్‌లో రాఘవేంద్ర ఇంటి ప్రహరీని పగలగొట్టి, భయభ్రాంతులకు గురి చేసిన ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో ఈ చర్య తీసుకున్నారు.

March 17, 2026 / 07:07 AM IST

ధర్మవరంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న 52 మందికి రూ. 26,66,373 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు సీఎంఆర్‌ఎఫ్, ఎల్ఓసీల నుంచి మొత్తం రూ. 8.61 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు మంత్రి వెల్లడించారు.

March 17, 2026 / 07:06 AM IST

సోమేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కింపు..!

WG: భీమవరం గునుపూడిలో శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. రూ.8,50,661లు, స్వామివారి శాశ్వత నిత్య అన్నదానం హుండీ ద్వారా రూ.17,319ల ఆదాయం లభించిందని ఆలయ ఈవో కృష్ణమురాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

March 17, 2026 / 07:06 AM IST

నేడు ఉపాధి హామీ పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ

ASR: గూడెంకొత్తవీధిలో ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు ఎంపీడీవో రమణబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని 16 పంచాయతీల్లో పథకం ద్వారా జరిగిన పనులపై ఈ సదస్సులో చర్చిస్తామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు.

March 17, 2026 / 07:06 AM IST

పరిహారం ఇవ్వకపోవడంతో రోడ్డు పనులు అడ్డుకున్న రైతు

SKLM: బూర్జ మండలం అల్లెన గ్రామానికి చెందిన రైతు తవిటి నాయుడుతో వినూత్నంగా సోమవారం నిరసన తెలిపారు. పాలకొండ ప్రధాన రహదారి నుంచి అల్లెన గ్రామానికి రోడ్డు నిర్మాణం కోసం చర్యలు చేపట్టారు. తమ భూమి తీసుకుని, తమకు నష్ట పరిహారం ఇవ్వలేదని రైతు రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకుని, తమకు పరిహారం ఇచ్చాకే పనులు చేయాలని రోడ్డుకు అడ్డంగా కంచె వేసి నిరసన వ్యక్తం చేశాడు.

March 17, 2026 / 07:05 AM IST

నేడు ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా

SKLM: బలగలోని డీఎల్‌టీసీ ప్రభుత్వ ఐటీఐలో ఇవాళ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ అసిస్టెంట్ డైరెక్టర్ వి.రుఘురాం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. టాటా అడ్వాన్సుడ్ సిస్టం లిమిటెడ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందని , మెకానికల్, ఐటీఐ ఫిట్టర్, టర్నర్, ఇంటర్మీడియట్ విద్యార్హతలు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 17, 2026 / 07:03 AM IST

నేడు పరదేశమ్మ తల్లి పండగ

AKP: మండల కేంద్రమైన మునగపాకలో ఇవాళ పరదేశమ్మ తల్లి పండగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. సాయంత్రం పురవీధుల్లో మేళ తాళాలు, మంగళ వాయిద్యాలతో అమ్మవారి ఊరేగింపు ప్రారంభం అవుతుందన్నారు.

March 17, 2026 / 06:55 AM IST

‘ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుంది’

PPM: ముస్లిం మైనారిటీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని MLA బోనెల విజయ్‌ చంద్ర అన్నారు. సోమవారం స్థానిక జామియా మసీదులో నిర్వహించిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్‌ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు.

March 17, 2026 / 06:53 AM IST

‘ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి’

AKP: లాభదాయకమైన ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ ఛైర్మన్ గండి బాబ్జి సూచించారు. సోమవారం సబ్బవరం మండలం అమృతపురంలో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలన్నారు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం రాయితీపై వ్యవసాయ యంత్రాలను అందిస్తున్నట్లు తెలిపారు.

March 17, 2026 / 06:51 AM IST

సత్యసాయి సేవా సంస్థల ఇఫ్తార్ విందు

VSP: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సత్యసాయిబాబా బోధించిన మత సామరస్య సందేశాన్ని స్మరించుకుంటూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు జిల్లా ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలోని సత్యసాయి ప్రేమసదన్‌లో ముస్లిం సోదరులకు సోమవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యర్రమంలో తారా, మొహమ్మదియా, ఆల్ మదీనా మసీదులకు చెందిన ముస్లింలు పాల్గొన్నారు.

March 17, 2026 / 06:50 AM IST

గంటలోపే బ్యాగ్ రికవరీ.. పోలీసుల చాకచక్యం

VSP: ఆర్కే బీచ్ వద్ద పోగొట్టుకున్న నాలుగు తులాల బంగారు హారం, సెల్‌ఫోన్ ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌ను 3 టౌన్ పోలీసులు గంటలోపే గుర్తించారు. పాలకొండకు చెందిన మల్లికార్జునరావు ఫిర్యాదు మేరకు సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా వైజాగ్ ఎక్స్‌పో ప్రాంతంలో బ్యాగ్‌ను పోలీసులు గుర్తించి యజమానికి అప్పగించారు. బాధితులు పోలీసులకు కృతజ్ఞత తెలిపారు.

March 17, 2026 / 06:49 AM IST

ఘనంగా తిమ్మగురుడు స్వామి ఉత్సవాలు

KRNL: మండలంలోని ఎరుకలచెరువు గ్రామంలో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు ఊరు కొండపై వెలసిన శ్రీశ్రీ తిమ్మగురుడు స్వామి ఉత్సవాలు జరగనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ నెల 19న గ్రామ దేవుళ్లకు నైవేద్యం సమర్పణ, 20న ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం కుందేలు పారి వేట, సాంస్కృతిక కార్యక్రమం, 21న వసంతోత్సవం జరుగునున్నట్లు చెప్పారు.

March 17, 2026 / 06:43 AM IST

రేపటి నుండి అధికారుల చేతుల్లోకి మున్సిపాలిటీలు

కాకినాడ: జిల్లాలోని పిఠాపురం, తుని, పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలతో పాటు గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీల కాలపరిమితి మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో బుధవారం నుంచి ఈ స్థానాల్లో ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించనున్నారు. తిరిగి ఎన్నికలు జరిగే వరకు లేదా గరిష్ఠంగా ఆరు నెలల పాటు అధికారుల పాలనలోనే పురపాలన కొనసాగనుంది.

March 17, 2026 / 06:43 AM IST

పోరంకిలో యాక్సిడెంట్.. వృద్ధురాలు మృతి

కృష్ణా: పోరంకిలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడిగడప నుంచి పోరంకి వైపు వెళుతున్న కారు త్రినేత్ర హాస్పటల్ వద్ద పోరంకి గ్రామానికి చెందిన అలివేలు మంగమ్మ (79), కుమార్తె నాగ శిరోమణిని ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలు కాగా, వారిని వెంటనే స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అలివేలు మంగమ్మ మృతి చెందారు. నాగ శిరోమణి ఆరోగ్యం నిలకడగా ఉంది.

March 17, 2026 / 06:42 AM IST