NDL: APSSDC ఆధ్వర్యంలో ఈ నెల 25న నంద్యాలలోని NTR షాదీఖానలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 13 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై 870 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి నుంచి PG వరకు చదివిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన నిరుద్యోగులు నేరుగా హాజరు కావాలని ఆయన సూచించారు.
ATP: కణేకల్లు మండలం యర్రగుంటలో శ్రీ యణేరంగస్వామి రథోత్సవం ఈ నెల 28న నిర్వహించనున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని ఊరేగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 24న ఎద్దుల పరశ, 27న ఉదయం 5 గంటలకు గంగపూజ, 28న సాయంత్రం శ్రీ యన్నప్ప తాత స్వామి బ్రహ్మరథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పుర దేవత బలుసులమ్మ వారికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులు ఎనిమిదోరోజు శుక్రవారం పట్టు వస్త్రాలు అందచేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ వడ్డే రఘురామ్ నాయుడు కూడా పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు.
GNTR: రంజాన్ పండుగ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేశ్ బాబు శుక్రవారం పారిశుద్ధ్య తనిఖీలు చేపట్టారు. మసీదుల పరిసరాల్లో వ్యర్థాలు లేకుండా చూడాలని, డ్రైనేజీలు సక్రమంగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పండుగ వేళ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య విభాగం అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
E.G: కొవ్వూరులో వచ్చే పుష్కరాల నేపథ్యంలో చేపట్టనున్న అభివృద్ధి, సదుపాయాల పనులపై రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా భక్తుల సౌకర్యాలు, మౌలిక వసతులు, రహదారుల అభివృద్ధి, శుభ్రత & భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
NDL: మహానంది మండలం తిమ్మాపురం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు ప్రకృతి యాత్ర నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయుడు చింతకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఏపీ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో శుక్రవారం యాత్ర చేపట్టి విద్యార్థులను ఓంకారం క్షేత్రానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రకృతి వనరుల ప్రాధాన్యం, పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ASR: డుంబ్రిగూడ గ్రామానికి చెందిన శ్రీను శెట్టికి ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. స్టాటిస్టిక్స్ విభాగంలో ప్రొఫెసర్ బి.మునిస్వామి మార్గదర్శకత్వంలో ఫెర్టిలిటీ ప్యాటర్న్‌పై పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఈ పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా సిజేరియన్ ప్రసవాలు 21% పెరిగినట్లు వెల్లడించారు. 2030 నాటికి ఇవి 29%కు చేరే అవకాశం ఉందన్నారు.
ATP: గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలోని బాటసుంకులమ్మ అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ పూజారి ఆలయం వద్ద ఎవరు లేని సమయంలో హుండీలోని రూ.570 నగదును చోరీ చేశాడు. చోరీ చేస్తున్న దృశ్యాలని సిసి ఫుటేజ్‌లో నమోదయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు శుక్రవారం విచారణ చేపట్టారు.
VZM: మొక్కజొన్నలు మద్దతు ధరకు మార్క్ పెడ్ ద్వారా ప్రభుత్వం కొనాలని కోరుతూ ఈనెల 23వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బి.రాంబాబు చెప్పారు. ఇవాళ రాంబాబు గజపతినగరంలో మాట్లాడుతూ.. దళారులు తక్కువ రేటుకు కొనుగోలు చేయడం వలన మొక్కజొన్న రైతులు నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు.
E.G: కడియం మండల దుళ్లలో సుమారు 35 కుటుంబాలకు అదే గ్రామానికి చెందిన దాత, సామాజికవేత్త కంటిపూడి కిరణ్ కుమార్ అపరాల కిట్లు అందజేశారు. రంజాన్ సందర్భంగా సుమారు రూ.20 వేలు విలువైన కిట్లను శుక్రవారం అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ తోకల శ్రీనివాస్‌లు కిరణ్ సేవలను అభినందించారు.
సత్యసాయి: సోమందేపల్లి మండల ఎస్ఐగా నూతన బాధ్యతలు స్వీకరించిన సుధాకర్ యాదవ్ మంత్రి సవితను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సోమందేపల్లిలో శాంతిభద్రతలు కాపాడేందుకు తమవంతు కృషి చేస్తానని ఎస్ఐ తెలిపారు. మంత్రి సవిత ఆయనకు అభినందనలు తెలియజేసి విధుల్లో సమర్థంగా పనిచేయాలని సూచించారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి శుక్రవారం రావులపాలెం వాస్తవ్యులు కాశీ విశ్వనాధ రవి కుమార్ కుటుంబ సభ్యులు రూ.51, 116 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిబ్బంది వారికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
కోనసీమ: ఆలమూరులో కుంగ్‌ఫూ, కరాటే మాస్టర్ క్లబ్‌ల బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని మాట్లాడారు. కలవచర్ల గ్రామానికి చెందిన వాడవిల్లి అంజి బాబు చిన్ననాటి నుండి కుంగ్‌ఫూ, కరాటే పై ఆసక్తితో బ్లాక్ బెల్ట్ వరకు శిక్షణ పొంది ఫైట్ మాస్టర్‌గా ఎదగడాన్నారు. అంజిబాబు మన ప్రాంతం యువకుడు అవడం అభినందనీయమన్నారు.
VSP: హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చిన యువతి అంజలి జగదాంబ జంక్షన్‌లో బంధువుల ఇంటికి వెళ్లింది. అనంతరం తన వదినతో కలిసి ఆటోలో వేపగుంట ఫంక్షన్ హాల్‌కు వెళ్లే క్రమంలో ఆటోలో లగేజ్‌తో పాటు బంగారం ఉన్న బ్యాగును మరిచిపోయింది. పెందుర్తి క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై సూరిబాబు తన సిబ్బంది, సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోను గుర్తించి, బాధితురాలికి తన వస్తువులను అప్పగిచారు.
బాపట్ల: వేటపాలెం మండలం అక్కయ్యపాలెం పంచాయతి పరిధిలో లక్ష్మీపురం గ్రామంలో రూ. 30 లక్షలతో శుక్రవారం సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ అధ్యక్షులు జంగిలి రాముడు పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాలకొండయ్య ఆదేశాల ప్రకారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.