ప్రకాశం: ఎర్రగొండపాలెం పంచాయతీ కార్యాలయంలో బుధవారం రైతన్న మీకోసం కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారులు చేపట్టారు. ముఖ్యఅతిథిగా టీడీపీ ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు హాజరయ్యారు. రైతులకు లబ్ధి చేకూరే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, వారికి అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ చేకూరి సుబ్బారావు పాల్గొన్నారు.
PLD: వెల్దుర్తి మండలంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 30 మంది లబ్ధిదారులకు నగదు చెక్కులను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
W.G: ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో నడింపల్లి సత్యనారాయణరాజు స్వగృహంలో బుధవారం రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది. డిప్యూటీ స్పీకర్ RRR మాట్లాడుతూ.. కొత్త వరి వంగడాలు జై శ్రీరామ్ వంటి వాటిని సాగుచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అన్నారు. జిల్లా జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
సత్యసాయి: ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ధర్మవరం ఏపీఎస్ఆర్టీసీ బస్సు డిపోలో MLA పరిటాల సునీత ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమం, సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆమె పేర్కొన్నారు.
CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామి వారి ఆలయంలో గురువారం ఉగాది ఆస్థానం నిర్వహించనున్నట్లు అర్చకలు ఇవాళ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం పూర్వం శ్రీవారిని సుప్రభాత సేవతో మేలుకొల్పి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తర్వాత శ్రీవారి దర్శన భాగ్యం కల్పించనున్నట్లు తెలిపారు.
BPT: కొరిశపాడు మండలం మేదరమెట్లలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం 3 పరిధిలో ఉన్న ప్రజలు క్యాన్సల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఆశాలత బుధవారం తెలియజేశారు. ప్రతిరోజు పరిధిలో ఉన్న కాలనీలలో ప్రజలు వద్దకు నేరుగా వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. కావున ప్రజలందరూ ఈ స్క్రీనింగ్ పరీక్షలను వినియోగించుకోవాలన్నారు.
SKLM: లావేరు మండలం బుడుమూరు ఉన్నత పాఠశాలలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం (మార్చి 20) సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా కో ఆర్డినేటర్ గోవిందరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వేసవిలో పక్షులకు నీటికోసం మట్టిపాత్రలు పంపిణీ చేసారు. అడవులు, పంట చేలు తగ్గడం కారణంగా పిచ్చుకలు కనుమరుగయ్యాయన్నారు.
PPM: జియ్యమ్మవలస మండలంలోని రావాడ రాంభద్రపురం PHCని జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి ఇవాళ ముస్తాబు కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి పరిశుభ్రత, సౌకర్యాలను పరిశీలించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. నిర్వహణలో నాణ్యత పెంచి అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
VZM: ఇంటర్మీడియట్ పరీక్షలు ఇవాళ్టితో ముగిశాయి. ఫిబ్రవరి 23న ప్రారంభమైన ఈ పరీక్షలు మార్చి 18వ తేదీ వరకు జరిగాయి. ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు మంగళవారంతో ముగియగా, ద్వితీయ సంవత్సర పరీక్షలు నేటితో ముగిశాయి. పోలీసుల నిషేధాజ్ఞల నడుమ ఈ పరీక్షలు జరిగాయి.
AKP: ఇవాళ జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 8,873 మంది హాజరు కావలసి ఉండగా 8,747 మంది పరీక్ష రాసినట్లు డీఐఈఓ వినోద్ బాబు తెలిపారు. 126 మంది పరీక్షకు గైర్హాజర్ అయినట్లు చెప్పారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్ష నిర్వహించామన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.
కర్నూలు: జిల్లా వ్యాప్తంగా జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 189 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 16,130 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 15,941 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.
BPT: కారంచేడు మండలం ఆదిపూడి గ్రామానికి చెందిన కొమ్మినేని చంద్రశేఖర్ పోగొట్టుకున్న రెడ్మీ మొబైల్ ఫోన్‌ను కారంచేడు పోలీసులు గుర్తించి బుధవారం బాధితుడికి తిరిగి అప్పగించారు. 2024 నవంబర్ 9న ఫోన్ పోగొట్టుకోగా, నవంబర్ 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెక్నాలజీతో ఫోన్‌ను గుర్తించినట్లు ఎస్సై ఖాదర్ బాషా తెలిపారు.
E.G: కొవ్వూరు వైసీపీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత కమిటీల నిమిత్తం బుధవారం మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు వైసీపీ ఇంచార్జ్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు, మండల & నియోజకవర్గ స్థాయి పార్టీ కమిటీల నియామకాలను పూర్తి చేయాలని సూచించారు. వైసీపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
VZM: చీపురుపల్లి మండలం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఇవాళ దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎమ్మెల్యే కళా వెంకటరావు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన మాట ప్రకారం ‘ఇంద్రధనస్సు’ పథకం అమల్లోకి తెచ్చిందన్నారు. అంగవైకల్యం 40% పైబడిన ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. దివ్యాంగులుతో కలిసి బస్సులో ప్రయాణించారు.
కోనసీమ: రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పష్టం చేశారు. బుధవారం రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులతో నేరుగా మాట్లాడారు. అన్నదాతల ఆర్థిక భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ పథకం రైతులకు ఊరటనిస్తోందని అన్నారు.