చిత్తూరు రూరల్ మండలానికి చెందిన కూటమి సర్పంచులకు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఘన సన్మానం నిర్వహించారు. ఏప్రిల్ 2తో పదవీకాలం ముగియనున్న సందర్భంగా లక్ష్మీనగర్ కాలనీలోని కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌లో శాలువాలు కప్పి సత్కరించారు. గ్రామాల అభివృద్ధికి, కూటమి విజయానికి చేసిన సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు.
ప్రకాశం: పొన్నలూరు మండలం నాగిరెడ్డిపాలెం గ్రామ సమీపంలో సోమవారం RTC పల్లె వెలుగు బస్సు అదుపుతప్పి పొలాలలోకి దూసుకు వెళ్ళింది. ప్రమాదంలో బస్సులో ఉన్న 35 మంది సురక్షితంగా బయటపడ్డారు. స్టీరింగ్‌లో సాంకేతిక లోపం తలెత్తి బస్సు మలుపు తిరగలేదని బస్సు డ్రైవర్ తెలిపాడు. బస్సు కందుకూరు నుంచి కనిగిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి సోమవారం శ్రీకారం చుట్టారు. ట్రాక్ పరిసర ప్రాంతాల్లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చుట్టుగుంట, కొరిటిపాడు వాకింగ్ ట్రాక్‌లకు పెండింగ్ పనులను ఈ ఏడాది ముగిసేలోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
PLD: పెదకూరపాడులో సంవత్సర కాలంగా సర్పంచులకు గౌరవ వేతనాలు ఇవ్వటం లేదని ముస్సాపురం సర్పంచ్ తిరుపతమ్మ ఆవేదన చెందారు. పంచాయతీ కార్యాలయానికి రావద్దని హుకుం జారీ చేయడంతో ఇంతవరకు రాలేదన్నారు. వ్యవసాయ కూలీ పనులకే పోతున్నానని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. రెండవ తేదీతో పంచాయతీ సర్పంచుల పదవి కాలం ముగుస్తుందని ఇప్పటికైనా తమ వేతనాల బిల్లు కార్యదర్శి పెట్టాలని కోరారు.
VZM: బొండపల్లి మండలం కొండకిండం గ్రామంలో ఆస్తి తగాదాపై ముగ్గురు అన్నదమ్ములు మధ్య సోమవారం ఘర్షణ జరిగిందని ఎస్ఐ మహేష్ సోమవారం తెలిపారు. కలిశెట్టి గౌరినాయుడు కత్తితో దాడి చేయడంతో కలి శెట్టి సత్యనారాయణ, కలిశెట్టి బంగారు నాయుడులు గాయపడటంతో వారిని చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
PPM: జిల్లాలో ఎమ్మెల్యే బెందాలం అశోక్ గిరిజన నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. మార్చి 26న జరిగిన ఈ ఘటనలో పరుష పదజాలం ఉపయోగించారని ఆరోపిస్తూ గిరిజనులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేకపోతే తదుపరి కార్యాచరణ చేపడతామని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
AKP: నర్సీపట్నంలో మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్భంగా మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 వరకు పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించబడతాయని టౌన్ సీఐ గపూర్ తెలిపారు. ఇందులో భాగంగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు, గస్తీలు నిర్వహిస్తారన్నారు. ప్రజలు పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. అలాగే, నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని సాయి ఆరామంలో ఇవాళ ‘పి4’ (P4) కార్యక్రమం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొన్నారు. సమాజ సేవలో విశేష కృషి చేసిన మార్గదర్శకులకు, అండగా నిలిచిన ‘బంగారు కుటుంబాలకు’ ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలు అందజేసి గౌరవించారు.
నంద్యాల జిల్లా బేతంచర్లలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ప్రభావంతో వైసీపీకి చెందిన సుమారు 100 కుటుంబాలు టీడీపీలో సోమవారం చేరాయి. బుగ్గన ప్రసన్న లక్ష్మీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్త సభ్యులను ఆహ్వానించారు. ఈ చేరికలతో స్థానిక రాజకీయ సమీకరణాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి.
ATP: గుత్తి బార్ అసోసియేషన్ ఎన్నికలు ఇవాళ నిర్వహించారు. ప్రెసిడెంట్ పదవికి శ్రీకాంత్ రెడ్డి, మనోహర్ బాబు పోటీపడ్డారు. శ్రీకాంత్ రెడ్డికి 57, మనోహర్ బాబుకు 33 ఓట్లు వచ్చాయి. శ్రీకాంత్ రెడ్డి 24 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా నగదాని చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్గా రామ్మోహన్, కార్యదర్శిగా నవీన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అన్నమయ్య: మదనపల్లెలో చిన్నారి హత్య ఘటనపై స్పందించిన జిల్లా ఇంఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.10 లక్షల చెక్కును అందజేశారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులు పాల్గొన్నారు.
KRNL: పత్తికొండ మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామస్తులు సోమవారం రోడ్డుపై ధర్నా చేపట్టారు. టీడీపీ నాయకులు పత్తిపాటి ప్రకాష్, యువ నాయకులు శ్రీకాంత్ మాట్లాడుతూ.. విండు పవర్ భారీ వాహనాలు తిరగడం వల్ల రోడ్డు దెబ్బతిని పూర్తిగా పాడైపోయిందని విండ్ పవర్ కంపెనీకి చెందిన అధికారులు స్పందించి వెంటనే రోడ్డు వేయించాలని డిమాండ్ చేశారు.
కోనసీమ: 2047వ సంవత్సరానికి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్ళు పూర్తవుతున్న సమయానికి పేదరికం లేని సమాజం నిర్మించడమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పీ4 కార్యక్రమాన్ని చేపట్టినట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఇవాళ కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో జరిగిన పీ4 ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
SKLM: ఏపీ చెస్ ఇన్ స్కూల్స్ కమిటీ జిల్లా కన్వీనర్‌గా టెక్కలికి చెందిన సనపల భీమారావును నియమించారు. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ చెస్ ఇన్ స్కూల్ కమిటీలు సభ్యుడిగా వ్యవహరిస్తున్న భీమారావు రాష్ట్ర కమిటీ కన్వీనర్‌గా నియమించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి స్కూల్లో చదరంగం వ్యాప్తికి కృషి చేస్తానని అన్నారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వార్డు మాజీ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు రోడ్డుపై దీన స్థితిలో ఉన్న వృద్ధురాలికి బాసటగా నిలిచారు. అల్లిపురం, నేరెళ్ల కోనేరు ప్రాంతంలో ఆమెను గమనించి, లయ ఓల్డ్ ఏజ్ హోమ్‌కి తరలించారు. ఆమెకు ఎవరూ లేరని తెలుసుకుని ఆవేదన చెందారు. ఆయన చేసిన పనికి పలువురు అభినందించారు.