• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

AKP: పరవాడ మండలం లంకెలపాలెంలో పరదేశిమాంబ పండగ సందర్భంగా ఆర్కే రాయల్ యూత్ ఆధ్వర్యంలో శనివారం జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలను పెందుర్తి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజ్ ప్రారంభించారు. వచ్చే నెల 6వ తేదీ వరకు పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు.

March 29, 2026 / 08:30 AM IST

‘దళితుల రక్షణకు కఠిన చర్యలు అవసరం’

KRNL: దళితులపై దాడులు అమానుషమని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు మేకల భిక్షం శనివారం అన్నారు. జిల్లా పర్యటనలో ఆదోనిలో ప్రజల వినతులు స్వీకరించి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని అధికారులకు వెల్లడించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, డీఎస్పీ భార్గవి పాల్గొన్నారు.

March 29, 2026 / 08:28 AM IST

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

VZM: రామభద్రపురం చిన్నమ్మతల్లి గుడి వద్ద శనివారం పార్వతీపురం నుంచి రామభద్రపురం వస్తున్న RTC బస్సును బొబ్బిలి వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టిన ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికుడు అప్పారావు తీవ్రంగా గాయపడ్డారు. కురుపాం పెళ్లిచూపులకు సోదరిడితో వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్దానిక ASI అప్పారావు చెప్పారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రకి తరలించామన్నారు.

March 29, 2026 / 08:25 AM IST

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

VZM: రామభద్రపురం చిన్నమ్మతల్లి గుడి వద్ద శనివారం పార్వతీపురం నుంచి రామభద్రపురం వస్తున్న RTC బస్సును బొబ్బిలి వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టిన ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికుడు అప్పారావు తీవ్రంగా గాయపడ్డారు. కురుపాం పెళ్లిచూపులకు సోదరిడితో వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్దానిక ASI అప్పారావు చెప్పారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రకి తరలించామన్నారు.

March 29, 2026 / 08:25 AM IST

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్: కమిషనర్

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తి పన్ను దారులు ప్రభుత్వం ప్రకటించిన 50 శాతం వడ్డీ రాయితీ పొందే గడువు ఈ నెల 31 వరకు మాత్రమే ఉందని కమిషనర్ రవి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పన్నులు చెల్లించేందుకు వీలుగా ఆదివారం సెలవు రోజున సైతం మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

March 29, 2026 / 08:25 AM IST

చీపురుకట్ట పట్టిన ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి

ATP: అనంతపురం మార్కెట్ యార్డ్‌కు వచ్చే రైతులు, వ్యాపారుల సౌకర్యార్థం వేసవి దృష్ట్యా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి తెలిపారు. అనంతరం శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తాగునీటి సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

March 29, 2026 / 08:22 AM IST

పెరిదేపిలో మార్టూరి శేషయ్య విగ్రహ ఆవిష్కరణ

ప్రకాశం: కొండపి మండలం పెరిదేపిలో శనివారం టీడీపీ నాయకుడు మార్టూరు శేషయ్య కాంస్య విగ్రహాన్ని మంత్రి స్వామి ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. పెరిదేపిలో టీడీపీ బలోపేతానికి, అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

March 29, 2026 / 08:20 AM IST

వాలీబాల్లో పద్మావతి కళాశాల విద్యార్థినుల విజయం

TPT: పద్మావతి మహిళా డిగ్రీ & PG కళాశాల విద్యార్థినులు MITS మదనపల్లిలో జరిగిన జాతీయ స్థాయి ఫెస్ట్‌లో వాలీబాల్లో మొదటి స్థానం సాధించారు. విజేతలకు మెడల్స్, సర్టిఫికేట్లు, రూ. 6,000 బహుమతి లభించింది. ప్రిన్సిపల్ డా. నారాయణమ్మ విద్యార్థినులను అభినందించారు. చదువులోనే కాదు క్రీడల్లో కూడా ప్రతిభ చూపి కళాశాలకు మంచి పేరు తీసుకువచ్చారని తెలిపారు.

March 29, 2026 / 08:11 AM IST

పట్టణంలో పర్యటించిన కలెక్టర్, సబ్ కలెక్టర్

PPM: నగర సుందరీకరణ పనుల్లో భాగంగా బ్రిడ్జి సమీపంలోని ఖాళీ ప్రదేశాల్లో ముమ్మరంగా మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి పాల్గొన్నారు. శనివారం గెడ్డ వీధిలో కలెక్టర్ స్వయంగా పాల్గొని పనులను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం చివరి భాగంలో కొబ్బరి మొక్కలను నాటడం జరిగిందన్నారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ వైశాలి ఉన్నారు.

March 29, 2026 / 08:07 AM IST

నిరసన కార్యక్రమం తాత్కాలిక వాయిదా: సీపీఐ

VZM: గత ఐదు రోజులుగా కొత్తవలస రెవెన్యూ పరిధిలో 2018లో పంపిణీ చేసిన పట్టాలకు ఇంటి స్థలం అప్పగించాలంటూ చేస్తున్న నిరసన కార్యక్రమం తాత్కాలంగా వాయిదా వేసినట్లు స్దానిక CPI నాయకుడు డేగల అప్పలరాజు శనివారం తెలిపారు. నిజమైన అర్హుల జాబితా పరిశీలించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు న్యాయం చేస్తామని MRO రమాలక్ష్మి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

March 29, 2026 / 08:06 AM IST

ONGC బాధితుల కోసం సీఎం ను కలిసిన మల్లాడి

కోనసీమ: యానాం దర్రియలతిప్ప బ్లో అవుట్ బాధితులకు ఓఎన్జీసీ నుంచి నష్టపరిహారం ఇప్పించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించాలని కోరుతూ మల్లాడి కృష్ణారావు బుచ్చిబాబు, కొండ బాబు, రత్నాకర్‌తో కలిసి సీఎం చంద్రబాబును శనివారం కలిశారు. మల్లాడి విన్నపానికి సానుకూలంగా స్పందించిన సీఎం, తక్షణమే కలెక్టర్ స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

March 29, 2026 / 08:05 AM IST

APR 2న జర్నలిస్టులకు FREE హెల్త్ క్యాంప్

చిత్తూరు జిల్లాలో అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, అపోలో బ్లాక్‌లో అపోలో ఆధ్వర్యంలో మెడికల్ మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్ ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు.

March 29, 2026 / 08:05 AM IST

నేటి చికెన్ ధర వివరాలివే

KKD: పిఠాపురం పట్టణంలోని మాంసం మార్కెట్లో చికెన్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. గత వారంతో పోలిస్తే కిలోకు రూ.10 నుంచి రూ. 20 వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం సాధారణ చికెన్ రూ.270, స్కిన్‌లెస్ రూ.320, బోన్‌లెస్ రూ.380 వరకు పలుకుతోంది. ఆదివారం కావడంతో దుకాణాల వద్ద రద్దీ కనిపించినా, ధరల భారంతో సామాన్యులు వాపోతున్నారు. నాటుకోడి కిలో రూ.450కి చేరింది.

March 29, 2026 / 08:05 AM IST

రేపు ఒంటిమిట్టకు సీఎం.. షెడ్యూల్ ఇదే..!

KDP: ఒంటిమిట్టలో రేపు జరగనున్న కోదండరామయ్య కళ్యాణానికి సీఎం చంద్రబాబు రానున్నారు. సాయంత్రం 4:15 గంటలకు ఒంటిమిట్టలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు. 4.30-6:05 TTD గెస్ట్ హౌస్ రెస్ట్, 6:15-6:30 స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ, 6:35 సీతారామయ్య కళ్యాణ వేదికకు చేరుకుంటారు. 6:45-8:30 తలంబ్రాలు సమర్పించి కళ్యాణాన్ని తిలకిస్తారు.

March 29, 2026 / 08:02 AM IST

ఇంటి పన్ను బకాయిదారులకు కఠిన హెచ్చరిక: DDO

అనకాపల్లి డివిజన్లో ఇంటి పన్నులు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీడీవో మంజులావాణి హెచ్చరించారు. బకాయిదారులకు నోటీసులు జారీ చేసి ఆస్తులు జప్తు చేస్తామని తెలిపారు. 325 పంచాయతీలలో రూ.26.34 కోట్లలో రూ.20.75 కోట్లు వసూలయ్యాయని, మిగిలిన రూ.5.59 కోట్లు నెలాఖరులోగా వసూలు చేయాలని ఆదేశించారు. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

March 29, 2026 / 08:00 AM IST