• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టిస్తున్న తలుపులమ్మ లోవ ఆలయం

KKD: తుని మండలం లోవ క్షేత్రంలో తలంపులమ్మ వెలిశారు. దేశంలో ఉత్తరాది, దక్షిణాదిలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. రూ.4.5 కోట్లతో నిర్మిస్తున్న ఎస్కలేటర్ పనులు పూర్తి కావచ్చాయని పేర్కొన్నారు. భక్తులు కొండ ఎక్కేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నామని ఈవో తెలిపారు. ఇంత వరకు దేశంలో ఏ ఆలయానికి ఎస్కలేటర్ లేదని ఆయన తెలిపారు.

March 30, 2026 / 03:45 PM IST

ప్రాజెక్ట్ కాలువ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

SKLM: గగంగువారి సిగడాం మండలంలో మడ్డువలస ప్రాజెక్ట్ కాలువ పనుల పురోగతిని ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు సోమవారం పరిశీలించారు. దేవరవలస వద్ద చేపడుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూ.26 కోట్ల 90 లక్షల నిధులతో ఫేజ్-2 పనులు జరుగుతున్నాయన్నారు. ఖరీఫ్ సీజన్‌కు రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

March 30, 2026 / 03:40 PM IST

జంట హత్యల ఘటనను పరిశీలించిన ఎస్పీ

NLR: కొడవలూరు (మం) గండవరం పొలాల సమీపంలో జంట హత్యల ఘటన జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల అడిషనల్ ఎస్పీ సౌజన్యతో కలిసి పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రూరల్ DSP ఘట్టమనేని శ్రీనివాసరావు, పోలీసు సిబ్బందిని హత్యలు జరిగిన విధానంపై ఆరా తీశారు. ఏ ఒక్క ఆధారం వదలకుండా కేసును త్వరితగతిన చేధించాలని సిబ్బందికి సూచించారు.

March 30, 2026 / 03:39 PM IST

ఆస్తి వివాదం.. వ్యక్తిపై యాసిడ్ దాడి.!

GNTR: పొన్నూరు(మం) చింతలపూడిలో ఆస్తి వివాదం యాసిడ్ దాడికి దారితీసింది. గ్రామానికి చెందిన మారుపూడి సుబ్బయ్య (65) అదే గ్రామానికి చెందిన కోడూరు శ్రీనివాసరావు (65)పై యాసిడ్‌తో దాడి చేశాడు. శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

March 30, 2026 / 03:36 PM IST

రేపు శ్రీ హరి హర క్షేత్రం 20వ వార్షికోత్సవం

ప్రకాశం: చీమకుర్తిలో శ్రీ హరి హర క్షేత్రం నందు 20వ వార్షికోత్సవం మంగళవారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆరోజు ఉదయం స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు, హోమాలు తదుపరి స్వామివారికి నగర ఉత్సవం ఘనంగా జరగనుంది. సాయంత్రం వేళల్లో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో విద్యుత్ మహా ప్రభ నెలకొల్పనున్నట్లు ఆయల నిర్వహకులు తెలిపారు.

March 30, 2026 / 03:33 PM IST

కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి: MRPS

తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తనను జై భీమ్ MRPS రాష్ట్ర అధ్యక్షుడు జానయ్య మాదిగ సోమవారం ఖండించారు. ఎస్సీ వర్గానికి చెందిన దళిత నాయకుడిని బెదిరించడం సరికాదన్నారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత హక్కులపై దాడి సహించమని వారు హెచ్చరించారు.

March 30, 2026 / 03:32 PM IST

అంగన్వాడీ కేంద్రాన్ని వేరే గ్రామానికి మార్చోదు

VZM: బాడంగి మండలం పినపెంకి పంచాయతీ పరిధిలోని గదబవలస గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని అదే గ్రామంలో కొనసాగించాలని సీఐటీయూ మండల కన్వీనర్ ఎ. సురేశ్ కోరారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీవో, ఎమ్మార్వోలకు వినతిపత్రం సమర్పించారు. అంగన్వాడీ కేంద్రాన్ని ఇతర గ్రామానికి మార్చేందుకు అధికారులు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.

March 30, 2026 / 03:32 PM IST

‘ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల మూలపేట పోర్టు’

PPM: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాలు కల మూలపేట పోర్టు అని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. 2023 ఏప్రిల్ 19న మూలపేట కోర్టుకు జగన్ శంకుస్థాపన చేశారని 70 శాతం పనులు పూర్తి చేశారని అన్నారు. మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం టీడీపీ అని దుయ్యబట్టారు. జగన్‌కు మంచి పేరు వస్తుందని చెప్పి కోర్టు నిర్మాణం పూర్తి చేయలేదని అన్నారు.

March 30, 2026 / 03:32 PM IST

కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీకి ISO సర్టిఫికేట్

కోనసీమ: రాష్ట్ర వ్యాప్తంగా 24 గ్రామ పంచాయతీలను అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాల (ISO) సర్టిఫికేట్ కోసం ఎంపిక చేశారు. అందులో అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీకి ఈ ప్రతిష్టాత్మక ISO సర్టిఫికేట్ లభించడం గర్వకారణమని అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇవాళ గ్రామ సర్పంచ్ రాకాపు విజయలక్ష్మిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

March 30, 2026 / 03:31 PM IST

హిందూ దేవాలయాల భూములను రక్షించాలి: BJP

E.G: హిందూ దేవాలయాల భూములను రక్షిస్తూ.. శిధిలావస్థలో ఉన్న ఆలయాలను పున: నిర్మించాలని BJP జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర కోరారు. ఇవాళ రాజమండ్రిలోని కలెక్టర్ వద్ద నిర్వహించిన PGRSలో వినతి పత్రం అందజేశారు. హిందూ ఆలయ భూములు ఇతరులకు చేతుల్లోకి వెళ్ళటం అంగీకారయోగ్యం కాదని, ప్రభుత్వం కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఆలయ నిర్మాణాలకు సహకరించాలని కోరారు.

March 30, 2026 / 03:29 PM IST

మాచాని సోమప్పకు నివాళులర్పించిన ఎమ్మెల్యే

KRNL: ఎమ్మిగనూరులోని మాచాని సోమప్ప సర్కిల్ వద్ద ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సోమప్ప విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పద్మశ్రీ మాచాని సోమప్ప 48వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేనేత అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన స్ఫూర్తితో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు, అభిమానులు పాల్గొన్నారు.

March 30, 2026 / 03:24 PM IST

‘ప్రతీ పేదవాడికి సొంతిల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం’

KRNL: అర్హులైన ప్రతీ పేదవాడికి సొంతిల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని TDP ఇన్‌ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి అన్నారు. ఇవాళ కంబలదిన్నె గ్రామంలో MPDO ప్రభావతి దేవి, TDPమాజీ మండల అధ్యక్షుడు ఈరన్న, పలువురుతో కలిసి గృహ ప్రవేశాలను ప్రారంభించారు. సొంతింటి కల నెరవేరడం అనేది కేవలం ఓ ఇల్లు కట్టించడం మాత్రమే కాదు, అది ఒక కుటుంబానికి భద్రత అని పేర్కొన్నారు.

March 30, 2026 / 03:23 PM IST

‘శానిటేషన్ కార్మికుల వేతనాలు సక్రమంగా చెల్లించాలి’

KDP: జిల్లాలోని ప్రొద్దుటూరు, వేంపల్లి, పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికుల వేతనాలు తగ్గించి చెల్లిస్తున్నారని ఆరోపిస్తూ ఏఐటీయూసీ నాయకులు పాత రిమ్స్‌లో జిల్లా కార్మిక శాఖ అధికారి ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. డిసెంబర్ 2025 వరకు రూ.12,400 చెల్లించగా, జనవరి 2026 నుంచి రూ.11,700–11,800 మాత్రమే జమ చేస్తున్నారని తెలిపారు.

March 30, 2026 / 03:21 PM IST

నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వినతి

SKLM: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలని AIYF- AISF నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ గ్రీవెన్స్ సెల్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్‌కి సోమవారం వినతి పత్రం అందించారు. లక్ష ఉద్యోగాలతో నూతన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ.3 రూపాయలు బకాయిలతో సహా చెల్లించాలని నాయకులు కోన్న శ్రీనివాస్, నాగభూషణం డిమాండ్ చేశారు.

March 30, 2026 / 03:20 PM IST

‘పన్నుల వసూళ్లలో పేదలను వేధిస్తున్నారు’

కడప నగరంలోని YSR ప్రెస్ క్లబ్‌లో మున్సిపల్ పన్నుల వసూళ్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కార్పొరేషన్ అధికారులు ఇంటి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలాల పన్నుల వసూళ్లలో సంపన్నులను వదిలేసి పేదలను వేధిస్తున్నారని ఆరోపిస్తూ సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

March 30, 2026 / 03:18 PM IST