కోనసీమ: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్‌గా వేటుకూరి సూర్యనారాయణ రాజు సోమవారం మంగళగిరి ఆఫీసులో ప్రమాణ స్వీకారం చేశారు. అయినవిల్లి మండలం మాగాం గ్రామంకి చెందిన ఆయన బీజేపీ లో జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు పదవులు చేశారు. ఆయనను మంగళగిరిలో మండల బీజేపీ అధ్యక్షులు వై.వెంకటరమణ, జి.వెంకటేశ్వరరావు, శ్రీనివాస రాజు కలిసి, సత్కరించి,శుభాకాంక్షలు తెలియజేశారు.
ATP: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అధ్యక్షతన నేడు సాయంత్రం 3 గంటలకు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది. తాడిపత్రి పట్టణ, రూరల్ మండల నాయకులు నుంచి కార్యకర్తలు ఈ చర్చలో పాల్గొనాలని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ బలోపేతంపై జరగనున్న ఈ భేటీకి అందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.
విశాఖ మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్లో విషాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలానికి చెందిన నితిన్ (బీటెక్ 3వ సంవత్సరం) స్నేహితులతో కలిసి ఆదివారం అక్కడికి వెళ్లాడు. ఈతకు దిగిన సమయంలో జారి నీటిలో మునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AKP: అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో ఇవాళ ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ యుద్ధ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఈ దాడులు ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తాయని, భారత్‌పైనా ఆర్థిక ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మౌనాన్ని తప్పుపట్టి, యుద్ధం నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
KKD: అనారోగ్యంతో కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రిమాండ్ ఖైదీ ఆదివారం మృతిచెందాడు. ఏలూరుకు చెందిన బొబ్బా లక్ష్మణ రావు(86) 2025లో భార్యను హత్య చేశాడు. ఈ కేసులో గత ఏడాది జులై నుంచి రాజమహేంద్ర వరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇటీవల కిడ్నీ, ఇతర ఆనారోగ్య సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురవడంతో అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు
ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ 13వ వార్డుకు చెందిన విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ సయ్యద్ తాహెర్ సోమవారం మరణించారు. విషయం తెలుసుకున్న వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన అన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ 13వ వార్డుకు చెందిన విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ సయ్యద్ తాహెర్ సోమవారం మరణించారు. విషయం తెలుసుకున్న వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన అన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: జిల్లాలో గృహ వినియోగ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారులకు పది రోజులు దాటినా డెలివరీ ఇవ్వకుండా, హోటళ్లకు అధిక ధరతో విక్రయిస్తున్నారు. అనంతపురం, హిందూపురం, ధర్మవరం ప్రాంతాల్లో ఈ దందా జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారులు తనిఖీలు పెంచి సిలిండర్ల డెలివరీలో పారదర్శకత పాటించాలని ప్రజలు కోరుతున్నారు.
NLR: చిట్వేలి – రాపూరు ఘాట్ రోడ్డులో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. చిట్వేలి ఏఎస్ఐ వెంగయ్య తెలిపిన వివరాల మేరకు గూడూరు నుంచి వేంపల్లికి నిమ్మకాయల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి ఘాట్ రోడ్డులోని కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. నిమ్మకాయల యజమాని లారీ నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు.
KDP: మైదుకూరు మండలం నంద్యాలంపేట సమీప పొలాలలో విద్యుత్ స్తంభాలు ఒరిగి కూలిపోయేలా ఉన్నాయి. తీగలు కూడా కిందకు వేలాడుతూ ప్రమాదాలకు ఆస్కారం ఉండేలా కొనసాగుతున్నాయని రైతులు అంటున్నారు. పొలంలో పనులు చేసుకోవాలన్న ప్రమాదాల భయం తమను వెంటాడుతోందని రైతులు అన్నారు. విద్యుత్ అధికారులు ఇటువంటి స్తంభాలను గుర్తించి బాగు చేయాలని కోరారు.
NDL: బ్రాహ్మణకొట్కూరు ఎస్సై మణికంఠ వాహనదారులకు రోడ్డు భద్రతపై సూచనలు చేశారు. వాహనాల్లో హై ఇంటెన్సిటీ లైట్ల వినియోగాన్ని తగ్గించాలని కోరారు. రాత్రివేళల్లో ఇవి ఎదురుగా వచ్చే వారికి ఇబ్బందులు కలిగించి ప్రమాదాలకు దారి తీస్తాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనలకు కఠిన చర్యలు ఉంటాయని ఇవాళ హెచ్చరించారు.
KKD: జిల్లా ఉపాధి కార్యాలయంలో సోమవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, మెకానికల్ చదివిన అభ్యర్థులు పాల్గొన వచ్చని అన్నారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్ జిరాక్స్‌తో ఉదయం 10:30 గంటల అర్హత కలిగిన నిరుద్యోగులు తమ సర్టిఫికేట్లతో హాజరు కావాలని తెలిపారు.
PPM: సన్యాసిరాజుపేట గ్రామ ప్రధాన రహదారి గోతులతో దారుణ స్థితికి చేరింది. వర్షాలు పడినప్పుడు రహదారిపై నీరు నిలిచి చిన్న చెరువుల్లా మారుతోంది. పార్వతీపురం మండలం బాలగుడబ నుంచి ఈ రహదారిపై నిత్యం వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. రహదారి పరిస్థితి వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, చోదకులు కోరుతున్నారు.
ASR: జిల్లాలో ఇటుకల పండుగ సందర్భంగా ప్రమాదం తృటిలో తప్పింది. గూడెం కొత్త వీధి మండలం దారకొండ పంచాయతీ పేట్రాయి గ్రామానికి చెందిన సుబ్బారావు బైక్‌పై వస్తుండగా ఘటన జరిగింది. రోడ్డుకు అడ్డంగా కట్టిన ప్లాస్టిక్ తాడు మెడకు తగలడంతో కిందపడిపోయి గాయపడ్డాడు.పెద్ద ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు, ఇలాంటి అడ్డంకులు తొలగించాలని కోరుతున్నారు.
VSP: ఆస్తిపన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీతో జీవీఎంసీకి భారీగా ఆదాయం సమకూరుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.552.50 కోట్లు వసూలై, గత ఏడాదితో పోలిస్తే రూ.116.3 కోట్లు అధికంగా నమోదయ్యాయి. మొత్తం లక్ష్యం రూ.569.59 కోట్లు కాగా, మార్చి 31లోపు రాయితీ గడువు ఉండటంతో చివరి రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.