CTR: వెదురుకుప్పం మండలం TKMపురంలో ఎమ్మెల్యే డా. థామస్ శనివారం పర్యటించనున్నట్లు MLA కార్యాలయం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 1న ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు అర్హులందరికీ ఎమ్మెల్యే పెన్షన్ నగదు అందజేయనున్నారు.
VSP: మహిళలు, బాలికలపై పెరుగుతున్న అత్యాచారాలు, హత్యలను అరికట్టాలని ఐద్వా డిమాండ్ చేసింది. శుక్రవారం జగదాంబ జంక్షన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి మాట్లాడుతూ.. నేరాలకు మద్యం,గంజాయి, డ్రగ్సే కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో ఈ నెలలోనే 18కిపైగా ఘోరాలు జరిగాయని తెలిపారు. గంజాయి ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
అన్నమయ్య: అమరావతి సచివాలయంలో పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్మెంట్ శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పోకల రమణారెడ్డి గారు ప్రమోషన్‌పై గ్రేడ్-1 మున్సిపల్ కమిషనర్‌గా రాయచోటికి నియమితులయ్యారు. గతంలో గోపవరం, ఖాజీపేట మండలాల్లో తహసీల్దార్‌గా పనిచేశారు. ఆయన స్వగ్రామం బ్రహ్మంగారి మఠం మండలం చౌటపల్లి.రాయచోటి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
VZM: కొత్తవలస మండలం చింతలపాలెంలో ఉపాధి హామీ నిధులతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శుక్రవారం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును పరిశీలించి నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
AKP: జనసేన ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ప్రతినిధి సుందరపు సతీశ్ కుమార్ శుక్రవారం అచ్యుతాపురం మండలం ఎర్రవరంలో రూ. 15 లక్షల జిల్లా పరిషత్ నిధులతో చేపట్టే ఇంటింటి కుళాయి పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ హయాంలో పడకేసిన పథకాలను పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని చెప్పారు.
SKLM: నందిగాం(M) కొత్త అగ్రహారం గ్రామ సమీపంలో శుక్రవారం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గడ్డికుప్పలు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి గడ్డికుప్పలు కాలిపోవడంతో అలజడి నెలకొంది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కృష్ణా: ఉయ్యూరులో ఇటీవల డిజిటల్ అరెస్టుకు గురైన వృద్ధ దంపతులను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శుక్రవారం శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డిజిటల్ అరెస్ట్‌కు గురైనప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎవరైనా వీడియో కాల్ ద్వారా లేదా వాయిస్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడితే నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీబీ), జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (జీడీఎంఎస్) ఆధ్వర్యంలో మహాజన సభ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జీడీఎంఎస్ ఛైర్మన్ వడ్రణం హరిబాబు నిర్వహించారు. ఈ సమావేశంలో సహకార సంఘాల అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై వారు ప్రధానంగా చర్చించారు.
ప్రకాశం: కొమరోలు మండలంలోని అల్లినగరం గ్రామంలో గల చిక్కుడు పంటను ఉద్యాన శాఖ అధికారి శ్వేత శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పంటలో పేను బంక, తదితర చీడపీడలను నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు అగ్రికల్చర్ అసిస్టెంట్, స్థానిక రైతులు పాల్గొన్నారు.
TPT: కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ అన్ని నియోజక వర్గాలు, జిల్లాకు సంబంధించిన ప్రాధాన్యత పనులపై సమీక్ష నిర్వించారు. ప్రతిపాదనలు త్వరగా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో డీఆర్‌వోలు, ఆర్టీవో, జిల్లా పంచాయతీ, మున్సిపల్ అధికారులు, టిడ్కో, సీపీవో, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.
W.G: నర్సాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి రామరాజు ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, క్షేత్రస్థాయిలో వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
SKLM: ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 18వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ అన్నారు . శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నరసన్నపేటలో ఏప్రిల్ 4, 5 తేదీలలో జరిగే మహాసభలకు కార్మికులు, రైతులు తరలిరావాలని కోరారు. జిల్లాలో భూమి,నిర్వాసితుల సమస్యలు, ఉపాధి హామీ అమలు వంటి అంశాలపై ప్రణాళిక రూపొందిస్తామన్నారు.
PPM: పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలోని గిరిమిత్ర హాలులో శుక్రవారం జరిగిన ‘గిరిజన పీజీఆర్ఎస్’ కార్యక్రమానికి స్పందన లభించింది. ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ గిరిజనుల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. అయిదు ప్రధాన వినతులు అధికారుల దృష్టిలోకి వచ్చాయన్నారు. ఈ సందర్బంగా పిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
KDP: పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తిచేసి బాధితులకు న్యాయం చేయాలని జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం నాడు ముద్దునూరు పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్లో ఉన్న రికార్డులను సక్రమంగా ఉన్నాయా లేదా పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిపై సంబంధిత సీఐ నగేష్ బాబుతో సమీక్ష నిర్వహించారు.
ELR: జనసేన పార్టీ సభ్యత్వం ప్రతి వ్యక్తికి గుర్తింపుతో పాటు భద్రతను కూడా కల్పిస్తుందని, కొత్త తరం నాయకులను తీర్చిదిద్దే సంకల్పంతో పార్టీ ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు సమావేశంలో ఆయన మాట్లాడారు.కేవలం 100 మంది సభ్యులతో ప్రారంభమైన జనసేన పార్టీ గత ఎన్నికల నాటికి 6 లక్షల సభ్యత్వాన్ని సాధించిందన్నారు.