E.G: జిల్లాలో జల్ జీవన్ మిషన్ పథకం కింద ఇప్పటివరకు 3.30 లక్షల ఇళ్లకు గృహాల టాప్ కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. బుధవారం భారత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అదనపు జేసీ సి.కమల్ కిషోర్ న్యూ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో 92% గృహాల వివరాలను అప్లోడ్ చేశామన్నారు.
GNTR: ఈనెల 21 వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సీపీఐ జాతీయ మహాసభలు చండీగఢ్‌లో నిర్వహిస్తున్నామని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. బుధవారం గుంటూరు కొత్తపేట సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశం ఎదుర్కొంటున్న అనేక ప్రజా సమస్యలపై మహాసభల్లో చర్చ ఉంటుందని అందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
PPM: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గిరిజనవసతి గృహాలకు ఆహార సామాగ్రి, సౌందర్య సాధనాల కొనుగోలుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్.వైశాలి సమక్షంలో బుధవారం గిరిమిత్ర హల్లో నిర్వహించారు. టెండర్లను తక్కువ ధరకు ఖరారు చేశారు. ఖరారైన బిడ్డర్ మూడు నెలలుపాటు సరఫరా చేయాలన్నారు.
ASR: అరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహంలో ప్రహరీ గోడ నిర్మాణం వెంటనే చేపట్టాలని SFI మండల కార్యదర్శి ఎస్.ఐసుబాబు బుధవారం కోరారు. ప్రహరీ గోడ లేక విద్యార్థినులకు రక్షణ కరువైందన్నారు. రక్షణ గోడ లేక పశువులు, ఇతర జంతువులు హాస్టల్లోకి వస్తున్నామని తెలిపారు. రాత్రిపూట బయట వ్యక్తులు హాస్టల్‌లోకి వస్తుండడంతో, విద్యార్థినులు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు.
ELR: పెంటపాడు మండలం నుండి 50 మందికి పైగా బీసీ సోదరులు బుధవారం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, ప్రజాసేవను నమ్మి పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఆయన సూచించారు.
ELR: జిల్లాలో ఇటీవల మళ్లీ అక్రమ మద్యం కేసులు వెలుగు చూడటంపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం బయటపడిన సంగతి తెలిసిందే. తాజాగా కొన్ని గ్రామాలలో అక్రమ మద్యం అమ్ముతున్న విషయం తన దృష్టికి రాగా, దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారులతో మాట్లాడారు.
VZM: బొబ్బిలిలో నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. బొబ్బిలి కోటలో వారి సొంత ఖర్చులతో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. ఈ జాబ్ మేళాలో సుమారు 500 మంది యువత పాల్గొనగా, 12 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం ఎన్నికైన వారికి ఎమ్మెల్యే నియామకపత్రాలను అందజేశారు.
ATP: రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డిపై గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం గుంతకల్లు హంపిరెడ్డి భవనంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు కసాపురం రమేష్ మాట్లాడుతూ.. తక్షణమే ఎమ్మెల్యే రైతు సంఘం నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
SKLM: బీసీ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ దామోదర నర్సింహులు పదవీ ప్రమాణస్వీకార కార్యక్రమం విజయవాడ గొల్లపూడి బీసీ భవనంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నర్సింహులకు పుష్పగుచ్చం అందించి, శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
E.G: రాజానగరం మండలం కానవరం జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు సైబర్ నేరాలపై జిల్లా సైబర్ ల్యాబ్ పోలీసులు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వారు మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని వాటిపై అవగాహన పెంచుకోవాలన్నారు.
ప్రకాశం: చీమకుర్తి మండలం మువ్వవారిపాలెంలో ICDS ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో బుధవారం పౌష్టికాహార మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్లు శైలజ, దేవసేన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలను తల్లులకు వివరించారు. పిల్లల్లో వచ్చే రక్తహీనత, వాటి లోపాల గురించి తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కోనసీమ: ఆలమూరు శ్రీదేవి, భూదేవి సమేత జనార్ధన స్వామివారి ఆలయ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని పాలకమండలి ఛైర్మన్ బైరిశెట్టి రాంబాబు, పాలకమండలి సభ్యులు వ్యాఖ్యానించారు. పాలకమండలి ప్రమాణ స్వీకారం అనంతరం బుధవారం తొలిసారిగా ఆలయంలో దేవస్థానం ఈవో నరేంద్ర కుమార్, అర్చకులు, సిబ్బంది సమక్షంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
KKD: గణపతి నవరాత్రుల ముగింపు పురస్కరించుకుని గణేష్ ఉత్సవ కమిటీ నాయకులతో బుధవారం సామర్లకోట తహసీల్దార్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. నిమజ్జనాలకు సంబంధించి ఎటువంటి అపశృతి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్, మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్యలు పలు సూచనలను చేశారు.
SKLM: బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని బుధవారం వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలో జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 35-45 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు.
VZM: ఎస్‌కోట మండలం బొడ్డవర గ్రామసభ కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పాల్గొన్నారు. జిందాల్ రైతులు 18 సంవత్సరాలుగా భూములు ఇచ్చి మోసపోయారని ప్రభుత్వం వెంటనే వీరికి చేసే ప్రయత్నం చేయాలని అదనపు కలెక్టర్‌కు వినతలు అందించారు. ఈ కార్యక్రమంలో జిందాల్ నిర్వాసితులకు పాల్గొన్నారు.