GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత నవంబర్లో జరిగిన బీ.ఆర్కిటెక్చర్ (5/5, 2వ సెమిస్టర్) సప్లమెంటరీ పరీక్షల ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఫలితాలను గురువారం పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు వెల్లడించారు. విద్యార్థులు తమ ఫలితాలను వర్సిటీ వెబ్సైట్లో చూసుకోవచ్చని, రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.