• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గుర్తు తెలియని డెడ్ బాడీ లభ్యం

TPT: రేణిగుంట మండలం గాజులమండ్యం నుంచి తండలం వెళ్లే రహదారిపై నాగార్జున రెడ్డి సిమెంట్ రాయి ఫ్యాక్టరీ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 45 ఏళ్ల వయస్సు గల ఈ వ్యక్తి గ్రీన్-బ్లాక్ గళ్ల ఫుల్ షర్టు,బ్రౌన్ షార్ట్ ధరించి ఉన్నట్లు గుర్తించారు. శరీరంపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా భావించి పోలీసులు కేసు నమోదు చేశారు.

April 1, 2026 / 07:25 AM IST

కొమ్మమరిలో భూముల రీ సర్వే ప్రారంభం

NDL: ప్యాపిలి మండలం కొమ్మమరి రెవెన్యూలో భూముల రీ సర్వేకు అధికారులు సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి సర్వే ప్రారంభమవుతుందని ఎమ్‌ఆర్‌వో భారతి తెలిపారు. రీ సర్వే ద్వారా భూముల హద్దులు స్పష్టతతో పాటు రికార్డులు సక్రమంగా నమోదు అవుతాయని పేర్కొన్నారు. సర్వే టీమ్ రాకపై ముందుగానే రైతులకు నోటీసుల ద్వారా సమాచారం ఇస్తామని వెల్లడించారు.

April 1, 2026 / 07:21 AM IST

వల్లూరు బాలికల వసతి గృహంలో తనిఖీలు

W.G: ఆచంట మండలం వల్లూరు ఎస్సీ బాలికల వసతి గృహాన్ని జాయింట్ ఇన్‌స్పెక్షన్ కమిటీ అధికారులు మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. వసతి గృహంలో అందుతున్న సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పడుకోవడానికి బెడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.

April 1, 2026 / 07:12 AM IST

‘ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు’

ATP: తాడిపత్రి బైపాస్ రోడ్డులో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి మంగళవారం సాయంత్రం విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా హెల్మెట్ ధరించని వాహనదారులకు రూ. 1035 జరిమానా విధించారు. త్రిబుల్ రైడింగ్, అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

April 1, 2026 / 07:12 AM IST

కలెక్టర్ కీలక ఆదేశాలు..!

ELR: జిల్లాలో వార్షిక రుణ ప్రణాళికను అనుసరించి ప్రాధాన్యత రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ వెట్రిసెల్వి బ్యాంకర్లను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో ఆమె సమీక్షించారు. కౌలు రైతులకు ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుకు నిర్దేశించిన లక్ష్యాల మేర రుణాలు అందించాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల సమస్యలను పరిష్కరించాలని సూచించారు

April 1, 2026 / 07:10 AM IST

చింతపాక, పెదపూడిలో నేడు విద్యుత్ సదస్సులు

AKP: పెదపూడి, చింతపాక గ్రామాల్లో APEPDCL ఆధ్వర్యంలో బుధవారం విద్యుత్ సమస్యలు, పీఎం సూర్యఘర్‌పై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు ఏఈ వెంకటరమణ మంగళవారం తెలిపారు. చింతపాకలో ఉదయం 10 నుంచి 1 వరకు, పెదపూడిలో మధ్యాహ్నం 2.30 నుంచి 4 వరకు కార్యక్రమాలు ఉంటాయి. ప్రజల సూచనలు స్వీకరిస్తామని పేర్కొన్నారు.

April 1, 2026 / 07:08 AM IST

పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం.. చింతపల్లి ఎంపీడీవో

ASR: చింతపల్లి మండలంలో 9,092 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ల కోసం రూ. 3,84,53,000 మంజూరైనట్లు ఎంపీడీవో సీహెచ్. సీతామహాలక్ష్మి మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 1న బుధవారం ఉదయం నుంచి లబ్ధిదారులకు ఇంటి వద్దే పెన్షన్ అందించాలని సిబ్బందిని ఆదేశించారు. లబ్ధిదారులందరూ ఇంటి వద్దే అందుబాటులో ఉండి సిబ్బందికి సహకరించాలని ఆమె కోరారు.

April 1, 2026 / 07:05 AM IST

రాయలసీమ యూనివర్సిటీకి NAAC లక్ష్యం: VC ఆచార్య

KRNL: వచ్చే విద్యా సంవత్సరానికల్లా రాయలసీమ యూనివర్సిటీ NAAC అక్రిడిటేషన్ సాధించాల్సిన అవసరం ఉందని వీసీ ఆచార్య వీ.వెంకట బసవరావు పేర్కొన్నారు. IQAC ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమీక్షలో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ సమాచారాన్ని క్రమపద్ధతిలో సేకరించి ఆధారాలతో అప్లోడ్ చేయాలని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ఉత్తమ ర్యాంక్ సాధ్యమేనని అభిప్రాయపడ్డారు.

April 1, 2026 / 07:05 AM IST

ఉరి వేసుకుని తల్లి కూతుర్లు మృతి

KDP: తొండూరు మండలం మల్లేలలో మంగళవారం రాత్రి తల్లీకూతురు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన షేక్ బీబీ(58), షేక్ ఇమాంబి(35) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకునట్లు స్థానికులు తెలిపారు. షేక్ బీబీ భర్త షేక్ ఇమామ్ బాషా ఇంట్లో కనిపించడం లేదని, అప్పుల బాధతో కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 1, 2026 / 07:02 AM IST

త్వరలో దోమ తెరలు పంపిణీ చేస్తాం: డీఎంహెచ్‌వో

PPM: త్వరలోనే దోమ తెరలను పంపిణి చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్. భాస్కరరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓ పత్రికలో వచ్చిన వార్త తెరలు కదలవు దోమలు వదలవు అనే కథనానికి ఆయన స్పందించారు. 2021 ఉమ్మడి విజయనగరం జిల్లాలో బాగంగా మన్యం జిల్లాకు సుమారు 3.50 లక్షల దోమ తెరలు ప్రభుత్వం కేటాయించందన్నారు. వాటిని పంపిణీ చేయడం జరిగిందన్నారు.

April 1, 2026 / 07:00 AM IST

‘సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’

ప్రకాశం: ఒంగోలు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన ఒంగోలు నియోజకవర్గ సమస్యలపై నిన్న సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తాగునీరు, రహదారులు, కాలువలు, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

April 1, 2026 / 07:00 AM IST

నియోజకవర్గ సర్పంచులకు ఘన సన్మానం

VZM: ఎస్. కోట పట్టణంలో ఉన్న ఎరుకమ్మ పేరంటాల కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ సర్పంచుల మంగళవారం సన్మాన సభ నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా జెడ్పీ ఛైర్మన్ శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరై. మాజీ ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు ఐదేళ్లు పదివికాలం పూర్తిచేసుకున్న సర్పంచు సేవలను గుర్తిస్తూ సత్కరించి ఆనందదాయకమన్నారు.

April 1, 2026 / 07:00 AM IST

ఎవరూ చేయని అభివృద్ధిని రోజా చేశారు: జగన్

TPT: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం మాజీ మంత్రి ఆర్కే రోజాతో కలిసి నగరి నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. 40 ఏళ్ల చరిత్రలో ఏ పాలకులు చేయని అభివృద్ధిని రోజా వైసీపీ పాలనలో చేసి చూపారని మాజీ సీఎం కొనియాడారు. కూటమి పాలనలో ప్రజలు నష్టపోవడం అందరూ ఇప్పటికే గుర్తించారన్నారు.

April 1, 2026 / 06:55 AM IST

నేడు వేట్లపాలెంకు విచారణ కమిటీ రాక

KKD: ఫిబ్రవరి 28న సామర్లకోట(మం) వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా ప్రమాద ఘటనకు సంబంధించి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ బుధవారం రానుంది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. విచారణ కమిటీ వేట్లపాలెంలో ప్రమాద ఘటనను పరిశీలించి సమాచారం సేకరిస్తారు.

April 1, 2026 / 06:54 AM IST

నేటి నుంచి ఇంటర్ సెకండియర్ ప్రారంభం

NLR: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో గల జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులను బుధవారం నుంచి 23 వరకు నిర్వహించాలని ఆర్‌ఏవో వరప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు క్లాసులు కండక్ట్ చేయాలని సూచించారు. అనంతరం మే 30 వరకు వేసవి సెలవులుంటాయని ఆయన వివరించారు.

April 1, 2026 / 06:49 AM IST