• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వెంకటేశ్వర స్వామి దర్శానాలు తాత్కాలికంగా బంద్

కాకినాడలోని జగన్నాథాపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శానాలను ఈ నెల 5వ తేదీ నుంచి 10 తేదీ వరకు ఉండవని ఈఓ సత్యవాణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయంలో మరమ్మతుల కారణంగా దర్శనాలను నిలిపివేస్తున్నామని చెప్పారు. కళ్యాణ మండపంలో ఉన్న ఉత్సవ మూర్తులను భక్తులు దర్శించుకోవాలన్నారు. ఈ అసౌకర్యానికి సహాకరించాలని ఆమె కోరారు.

April 4, 2026 / 06:20 AM IST

కడియపులంక ప్రత్యేక అధికారిగా సునీల్

E.G: కడియపు లంక రూర్బన్ పంచాయతీ ప్రత్యేక అధికారిగా తహసీల్దార్ సునీల్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు తాజా మాజీ సర్పంచ్ మారిశెట్టి పద్మావతి స్వాగతం పలికారు. ప్రత్యేక అధికారి బాధ్యతలు తీసుకున్న సునీల్ కుమార్‌కు ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, పీఎసీఎస్ ఛైర్మన్ నర్సయ్య, కూటమి నాయకులు సుబ్బారావు, తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు.

April 4, 2026 / 06:20 AM IST

రైలు కిందపడి బిటెక్ విద్యార్థి మృతి

కడప-కనుమలో పల్లె మధ్య గిరిజ భవన్ వెనుక శుక్రవారం సాయంత్రం రైలు కిందపడి బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతుడు కడప నగరంలోని ప్రకాశ్ నగర్ కాలనీకి చెందిన చింతకుంట సురేష్‌గా గుర్తించారు. మృతుడు నగరంలోని KSRM ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నట్లు SI తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

April 4, 2026 / 06:20 AM IST

హైవేపై బస్సుల ఆకస్మిక తనిఖీలు

NLR: జిల్లాలోని పాలెం వద్ద జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను శుక్రవారం రాత్రి ఆత్మకూరు సీఐ గంగాధర్ తనిఖీ చేశారు. మోటర్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ రాములు వారి సిబ్బందితో కలిసి బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులను తనిఖీ చేసి ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. బస్సులో మంటలను ఆర్పే పరికరాలను ఉంచుకోవాలని సిబ్బందిని కోరారు.

April 4, 2026 / 06:19 AM IST

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

SKLM: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పొందూరి ఎస్సై సత్యనారాయణ అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే మెసేజులను నమ్మవద్దని, మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాలలో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దని యువతకు తెలిపారు.

April 4, 2026 / 06:18 AM IST

రైలులో గుండెపోటు.. ప్రాణం కాపాడిన చదువు..!

TPT: సూళ్లూరుపెటలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న 55 ఏళ్ల ఉపేంద్రకు గుండెపోటు వచ్చింది. రాజా అనే యువకుడు వేగంగా స్పందించి ప్రథమ చికిత్స అందించాడు, స్టాఫ్ నర్స్ కోర్సు పూర్తి చేసిన అనుభవంతో ప్రాణం కాపాడాడు. రైలు స్టేషన్‌కు చేరగానే బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజా చేసిన సేవకు వైద్యులు, ప్రయాణికులు అతన్ని నిజమైన హీరోగా ప్రశంసించారు.

April 4, 2026 / 06:18 AM IST

బాలుడి అదృశ్యం.. కేసు నమోదు

WG: నరసాపురం రుస్తుంబాదకు చెందిన పేరి సాయి శరవణ (16) అనే బాలుడు అదృశ్యమైనట్లు పట్టణ ఎస్సై ముత్యాలరావు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 1వ తేదీన మధ్యాహ్నం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

April 4, 2026 / 06:15 AM IST

‘ఈ నెల 11న BC హక్కుల సాధనకు ఆమరణ నిరాహార దీక్ష’

VZM: ఈనెల 11న BC హక్కుల సాధనకై ఆమరణ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్లు భారత చైతన్య యువజన పార్టి జిల్లా కన్వీనర్‌ కృష్ణమూర్తి తెలిపారు. శుక్రవారం పట్టణంలో కరపత్రాలను విడుదల చేశారు. అయన మాట్లాడుతూ.. SC, ST, BCలకు రక్షణ చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. శాస్త్రీయ పద్ధతిలో కుల గణన చేపట్టాలని, BCలకు విద్య, ఉపాధి అవకాశాల్లో40 % రిజర్వేషన్‌ కేటాయించాలని కోరారు.

April 4, 2026 / 06:15 AM IST

నిజనిర్ధారణ కమిటీని నియమించిన వైఎస్ షర్మిల

W.G: ఆకివీడులో జరిగిన హింసాత్మక ఘటనపై నిజనిర్ధారణ బృందాన్ని నియమించినట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రకటించారు. BRK నాయుడు, అమర్జహా బేగం, విశ్వేశ్వర్ రెడ్డి, అంకెమ్ సీతారామ్‌లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ బృందం బాధిత కుటుంబాలతో మాట్లాడి పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించి నివేదిక సమర్పించాలని ఆమె కోరారు.

April 4, 2026 / 06:15 AM IST

బాలికపై దాడి కేసులో ఇద్దరు రిమాండ్

కర్నూలు (మ) ఈ. తాండ్రపాడు గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు CI తేజ మూర్తి శుక్రవారం తెలిపారు. ఆటో డ్రైవర్ మహేంద్ర, అతని స్నేహితుడు శివకుమార్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. కాగా, వీరి అఘాయిత్యం కారణంగా బాధితురాలు గర్భవతి కావడంతో మార్చి 28న ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

April 4, 2026 / 06:15 AM IST

నేడు రాజోలు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

కోనసీమ: నేడు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 10.30 గంటలకు  కేశనపల్లి బుద్ధనగర్ నందు అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నిర్వహించే మండల స్థాయి చదరంగం పోటీలను ప్రారంభిస్తారు . 11:30 గంటలకు అంతర్వేదికర గ్రామ పంచాయతీ దగ్గర రూ 55 లక్షలతో విలేజి హెల్త్ క్లినిక్ సెంటర్ నిర్మాణం చేయుటకు శంకుస్థాపన చేస్తారు. 

April 4, 2026 / 06:10 AM IST

30 పంచాయతీలకు 11 మంది ప్రత్యేకాధికారులు

SKLM: బూర్జ మండలంలోని పంచాయతీ సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తవ్వడంతో ప్రత్యేకాధికారుల పాలన శుక్రవారంతో ప్రారంభమైంది. ఈ మేరకు మండలంలో 30 పంచాయతీలకు 11 మంది ప్రత్యేక అధికారులను నియమించింది. MPDO తిరుపతిరావు మామిడి వలస, పెద్ద లంకాం, చిన్న లంకాం పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు.

April 4, 2026 / 06:07 AM IST

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

KDP: ప్రొద్దుటూరులోని మోడంపల్లె ఉపకేంద్రంలోని మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకకు SPDCL ఈఈ రమణారెడ్డి, డీఈ శ్రీనివాసులరెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు. సాయిరాజేశ్వరికాలనీ, మోడంపల్లె, టీచర్స్, డాక్టర్స్ కాలనీలు, జిన్నారోడ్డు, లైట్పాళెం, మైదుకూరు రోడ్డు ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.

April 4, 2026 / 06:00 AM IST

వేటపాలెం జింక ప్రత్యక్షం

BPT: వేటపాలెం(మం) రామన్నపేటలో గ్రామంలో ఉన్నట్టుండి ఓ జింక ప్రత్యక్షమైంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం జింకను అటవీశాఖకు అప్పగించే చర్యలు చేపట్టారు. గ్రామాల్లో జంతువుల ప్రవేశం అరుదుగా జరుగుతుందని వారు చెప్పుకొచ్చారు.

April 4, 2026 / 05:52 AM IST

ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్‌లు

ప్రకాశం: ఒంగోలు భాగ్యనగర్‌లో గల కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ మనీశ్ కుమార్ తెలిపారు. 2వ తరగతి నుంచి 12 తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

April 4, 2026 / 05:52 AM IST