• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఫేక్ సర్టిఫికేట్లు.. 69మందిపై వేటు..!

ATP: ఏపీఎస్పీడీసీఎల్‌లో నకిలీ ఐటీఐ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన 69 మంది షిఫ్ట్ ఆపరేటర్లపై వేటు పడింది. ఐటీఐ చదవకుండానే సర్టిఫికెట్లు సమర్పించినట్లు విచారణలో తేలడంతో వారిని తొలగించాలని సీఎండీ శివశంకర్ లోతేటి ఆదేశించారు. వీరిలో అనంతపురం జిల్లాకు చెందిన ముగ్గురు ఉన్నారు. అత్యధికంగా కడపలో 38 మందిపై చర్యలు తీసుకున్నారు.

April 4, 2026 / 07:30 AM IST

నేడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు

SKLM: తిరుమల పవిత్రతను కాపాడే దిశగా TTD ఛైర్మన్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని వైసీపీ ఆమదాలవలస సమన్వయకర్త రవికుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. BR నాయుడు TTDను అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఇవాళ YCP శ్రేణులు వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేయాలన్నారు.

April 4, 2026 / 07:24 AM IST

విశాఖపట్నం-రాయ్ పూర్ ప్యాసింజర్ రైళ్లు రద్దు

విశాఖపట్నం-రాయ్ పూర్ మధ్య ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సంబల్‌పూర్ డివిజన్‌లోని మునిగూడ-బిస్సాంకటక్ మధ్య వంతెన ఆధునీకరణ పనులు చేపట్టడమే దీనికి కారణమన్నారు. ఏప్రిల్ 9, 11, 13, 20, 23, 25 తేదీల్లో రైలు నంబర్లు (58528/58527) రెండు వైపులా నడవవని తెలిపారు.

April 4, 2026 / 07:20 AM IST

పెళ్లి పేరుతో మోసం.. యువతి ఆత్మహత్య..!

అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో మార్చి 30న ఆత్మహత్య చేసుకున్న లక్ష్మి కేసులో నిందితుడు కే.లోకేశ్(24)ను శుక్రవారం రైవాడ జలాశయం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఇన్‌ఛార్జ్ DSP శ్రీనివాసులు వెల్లడించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో 4, 5 ఏళ్ల నుంచి సంబంధం కొనసాగించాడన్నారు.

April 4, 2026 / 07:17 AM IST

ధర్మాజీగూడెంలో ఆటోను ఢీ కొట్టిన లారీ

ELR: లింగపాలెం మండలం ధర్మాజీగూడెం సమీపంలో శనివారం ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. దీంతో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే రేషన్ కుమార్ వెంటనే స్పందించి హుటాహుటిన సంఘటన స్థలంలో దిగి క్షతగాత్రులకు ధైర్యం చెప్పి వారిని ఆసుపత్రికి తరలించారు. అలాగే క్షతగాత్రులకు సత్వర వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టారు.

April 4, 2026 / 07:15 AM IST

దేవస్థానం ఉద్యోగి సస్పెన్షన్

NDL: మహానంది దేవస్థానంలో పనిచేస్తున్న jr. అసిస్టెంట్ శ్రీనివాసులును సస్పెన్షన్ చేస్తూ EO శ్రీనివాస రెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారని ఆలయ AEO ఎరమల మధు తెలిపారు. శ్రీనివాసులు విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో పాటు నిర్లక్ష్యం వహించారని గుర్తించినట్లు చెప్పారు. విచారణ చేసిన EO క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు

April 4, 2026 / 07:15 AM IST

వంతెనపై ప్రతి క్షణం భయమే..!

PPM: మామిడిపల్లి శంబర రహదారిలో ముచ్చెర్ల వలస కూడలి వద్ద ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుంది. వెంగళరాయసాగర్ నిర్మాణ సమయంలో కాలువపై నిర్మించిన ఈ వంతెన ఏళ్లుగా మరమ్మతులు లేక నిర్లక్ష్యానికి గురైంది. ఇరువైపులా రైలింగ్లు దెబ్బతిని ప్రయాణికులకు ప్రమాదకరంగా మారాయి. అధికారులు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

April 4, 2026 / 07:15 AM IST

అత్తిలి ఎస్సైగా విశ్వనాథ్ బాధ్యతలు స్వీకరణ

W.G: అత్తిలి ఎస్సైగా కె.ఎన్.విశ్వనాధ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లా కూచిపూడి పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా పని చేసిన ఆయన అత్తిలికి బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు అత్తిలి ఎస్సైగా వ్యవహరించిన పి.ప్రేమరాజు భీమవరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. శాంతిభద్రతలు కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

April 4, 2026 / 07:13 AM IST

నడక మైదానానికి పివిజి రాజు పేరు పెట్టాలి

VZM: స్థానిక 42వ డివిజన్‌ అయ్యన్నపేట జంక్షన్‌ వద్ద మున్సిపల్‌ నడక మైదానానికి గొప్ప దాత, విద్యాదాత పీవీజీ.రాజు పేరు పెట్టాలని ప్రముఖ సామాజికవేత్త త్యాడా రామకృష్ణ కోరారు. ఈ మేరకు శుక్రవారం MLA అతిది గజపతిరాజును కలసి వినతిపత్రం అందజేసారు. అనంతరం మాట్లాడుతూ.. పిల్లలకు క్రీడా పరికరాలు, యువతీ యువకులకు బహిరంగ వ్యాయామశాలా పరికరాలు ఎర్పాటు చేయాలని కోరామన్నారు.

April 4, 2026 / 07:12 AM IST

జిల్లాలో పోలీసుల ‘పల్లెనిద్ర’ కార్యక్రమం

CTR: జిల్లాలో పోలీసులు “పల్లెనిద్ర” కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, రోడ్డు భద్రత వంటి అంశాలపై ప్రజలకు సూచనలు అందించారు. ప్రజల సహకారంతో గ్రామాలను సురక్షితంగా మార్చడమే లక్ష్యమని పోలీసులు తెలిపారు.

April 4, 2026 / 07:10 AM IST

రహదారి విస్తరణ పనులపై అధికారులు విచారణ

AKP: పాయకరావుపేట ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో నాణ్యత లోపించిందని వైసీపీ శ్రేణులు చేసిన ఆరోపణలను టీడీపీ నాయకులు శుక్రవారం ఖండించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మండల టీడీపీ అధ్యక్షుడు చించెలపు ప్రదీప్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పరహాలబాబు మాట్లాడుతూ.. అవగాహన లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పనులపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు విచారణ జరుపుతున్నారన్నారు.

April 4, 2026 / 07:09 AM IST

గుర్తుతెలియని మృదేహం లభ్యం

KDP: బద్వేల్ మండలం పెద్ద చెరువు దగ్గర గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. దాదాపు 4 రోజుల క్రితం చనిపోయి ఉంటాడని తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బద్వేల్ సీఐ రామకృష్ణ మృతుడి వివరాలు ఎవరికైనా తెలిసి ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు. ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

April 4, 2026 / 07:05 AM IST

భక్తి ముందు ఓడిన గర్వం..!

తిరుమలలో తొండమాన్ చక్రవర్తి శ్రీవారికి బంగారు పుష్పాలతో అర్చనలు చేస్తూ తనకన్నా గొప్ప భక్తుడు లేడని గర్వించేవాడు. ఒకరోజు శ్రీవారి పాదాల చెంత మట్టిపూలు కనిపించాయి. ఆశ్చర్యపోయిన రాజుకు స్వామివారే కుమ్మరి దాసుడి భక్తిని వివరించారు. పేదవాడైన అతను భక్తితో మట్టిపూలు సమర్పించేవాడు. నిజమైన భక్తి సంపదలో కాదు, మనసులో ఉందని గ్రహించిన తొండమాన్ వినమ్రుడయ్యాడు.

April 4, 2026 / 07:04 AM IST

నేడు గవర్నర్ పర్యటన షెడ్యూల్ విడుదల

ATP: రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈ నెల 6న ఉ.9.25 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి 10.10 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11.25 గంటలకు అనంతపురం జేఎన్‌టీయూకు చేరుకుని స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం మ.1 గంటకు అనంతపురం నుంచి బయలుదేరి పుట్టపర్తికి చేరుకుని విజయవాడకు వెళ్తారు.

April 4, 2026 / 07:00 AM IST

6 నుంచి పది మూల్యాంకనం

E.G: టెన్త్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ ) సోమవారం నుంచి బీవీఎం ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో జరుగనుందని డీఈవో కంది వాసుదేవరావు తెలిపారు. శుక్రవారం రాజమండ్రి బీవీఎమ్ పాఠశాలలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. స్పాట్ వాల్యూయేషన్‌లో పని చేయుటకు జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్లుగా నియమించారు. 

April 4, 2026 / 07:00 AM IST