W.G: ఉగాది పర్వదినం సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్ విజయరామరాజు, సెక్రటరీ జనరల్ ప్రకాశం కోరారు. ఎన్నికల హామీ మేరకు పీఆర్సీ కమిషనర్‌ను నియమించి, పెండింగ్‌లో ఉన్న డీఏలను తక్షణమే విడుదల చేయాలని మంగళవారం వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు తీపి కబురు అందిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.