TG: ప్రముఖ సింగర్ ఆశాభోస్లే మృతికి సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సంగీతానికి ఆమె విశేష సేవలు అందించారని కొనియాడారు. ‘ఆశాభోస్లే మరణం దేశ సాంస్కృతిక, కళారంగానికి తీరని లోటు. ఆశాభోస్లే ఆత్మకు శాంతి చేకూరాలి’ అని పేర్కొన్నారు. అలాగే, భారతదేశం గర్వించదగ్గ గాయని ఆశాభోగ్లే ఇకలేరనే వార్త చాలా విచారకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.