»Men Need To Be Ready Like Women To Worship That God
Viral News: పురుషులు ఆ దేవుడిని పూజించాలంటే మహిళల్లా రెడీ కావాలి.. ఎక్కడో తెలుసా?
వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. మగాళ్లు అతివల్లా మారి రతి మన్మధులకు ప్రత్యేక పూజలు నిర్వహించే ఆచారం ప్రస్తుతం వైరల్గా మారింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Fire Accident : విజయవాడ ఆయిల్ శుద్ధి కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం
Viral News: ప్రపంచంలో చాలా ఆచారాలు ఉన్నాయి. అవి వారికి వింతేమి కాదు కానీ కొత్త వాటి గురించి తెలుసుకునే వారికి మాత్రం కచ్చితంగా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ప్రస్తుతం ఒక ఆచారం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ దేవుడుని పురుషులు పూజించాలంటే మహిళల్లా వేషధారణ ధరించాలి. ఈ పద్దతి కర్నూల్ జిల్లాలో ఉంది. పురుషులు, స్త్రీలుగా మారి రతి మన్మధులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంప్రదాయం ఎప్పటినుంచో కొనసాగుతోందని స్థానికులు తెలిపారు.
ఆదోని మండలం సంతేకుళ్లురు గ్రామంలో రతి మన్మధులు అనే ఆయలం ఉంది. ప్రతి సంవత్సరం హోలీ పండుగ ప్రారంభమైనప్పటి నుంచి వారం రోజుల పాటు ఇలా పూజలు నిర్వహిస్తారు. మగవారు ఆడవారి వేషధారణలో రతి మన్మధులకు పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకుంటారని స్థానికులు చెబుతున్నారు. హోలీ పండుగకు అందరూ రంగులతో పండుగ జరుపుకుంటారు. కానీ ఈ గ్రామంలో మగవారు స్త్రీల వేషం వేసుకుని రతి మన్మధులకు పూజలు నిర్వహించి కోరికలు కోరుతారు. ఇలా చేస్తే దేవుడు చల్లగా చూస్తాడని, వ్యాపారంలో, ఆరోగ్యంలో మంచి ఫలితాలు వస్తాయని వారి నమ్మకమట.