గుంటూరు జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్కి జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఘన స్వాగతం పలికారు. చినకొండ్రుపాడులో నిర్వహించిన ప్రైవేట్ వైద్య కళాశాల స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ని కలెక్టర్ పుష్పగుచ్ఛంతో ఆహ్వానించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.