NLR: బుచ్చి పట్టణంలో కూరగాయల మార్కెట్ అన్ని పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచించారు. బుచ్చి మార్కెట్ యార్డ్‌ను సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈ నెల 19వ తేదీన మార్కెట్ ఓపెన్ చేస్తామని వ్యాపారులకు తెలిపారు. మార్కెట్ సముదాయంలో వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు.