కోనసీమ: ఆలమూరు మండలం మూలస్థానంలో జాతీయ రహదారిపై శుక్రవారం వాటర్ బాటిళ్ల లోడుతో వెళ్తున్న మినీవ్యాన్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. వాటర్ బాటిళ్లు రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. అటుగా వెళ్తున్న వారంతా వెంటనే ఆగి డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీశారు. అంతటితో ఆగకుండా రోడ్డుపై పడిన బాటిళ్లన్నీ ఏరి ఒకచోట చేర్చారు. మానవత్వం చచ్చిపోలేదని నిరూపించారు.