GNTR: వేసవి వేడి పెరగడంతో జిల్లాలో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. గత నెలలో ఉమ్మడి జిల్లాలో 17.5 మిలియన్ యూనిట్లు వినియోగించగా, ప్రస్తుతం 20.1 మిలియన్ యూనిట్లకు చేరింది. జిల్లా సర్కిల్లో కూడా డిమాండ్ 7.3 నుంచి 8.5 మిలియన్ యూనిట్లకు పెరిగిందని అధికారులు తెలిపారు. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని ప్రజలకు సూచించారు.