PPM: జిల్లాలోని పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య ఆరోగ్య సేవలకు ఎటువంటి అంతరాయం లేదని DMHO డా. ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. వైద్యులు కొరత ఉన్న చోట సర్దుబాటు చేసి సేవలు అందించడడం జరుగుతుందన్నారు. ఈ నెల 2న ఓ పత్రికలో వచ్చిన వైద్యుల కొరత రోగుల వేత అనే కథనానికి ఆయన గురువారం ఖండించారు. జిల్లాలో 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయన్నారు.