ATP: బస్సుల ప్రైవేటీకరణతో పాటు, కార్మికులకు సంబంధించిన పెండింగ్ డీఏలు, ఇతర సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం ఆర్టీసీ డిపో ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి మాట్లాడుతూ.. ఆర్టీసీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.