GNTR: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి విడదల రజిని మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్కు అండగా ఉంటూ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నందుకే, ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తనపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా భయపడే ప్రసక్తే లేదని, తమకు జగన్ పూర్తి అండగా ఉన్నారన్నారు.