TPT: వరదయ్యపాలెం బలిజపాలెంకు చెందిన శివ అకాల మృతితో ఆ కుటుంబం అనాధగా మారింది. ఈ కష్టకాలంలో మిత్రులు మురళీకృష్ణ, మునిరాజ్, అబ్దుల్, నరేష్, శరవణ, మహేష్, హేమభూషణ్ అండగా నిలిచారు. మూడు నెలలకు సరిపడా నిత్యావసరాలు, ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటారు. భవిష్యత్తులోనూ తోడుంటామని హామీ ఇచ్చారు. మిత్రుల చొరవను పలువురు అభినందిస్తున్నారు.