కర్నూలు: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు పట్టణ పరిధిలో సోమవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు విజిబుల్ పోలీసింగ్‌ను కట్టుదిట్టంగా నిర్వహించారు. వన్‌టౌన్ సీఐ మారుతి శంకర్ ఆధ్వర్యంలో కొండారెడ్డి బురుజు నుంచి పాతబస్తీ,రాజ్ విహార్ ప్రాంతాల్లో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. అలాగే, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.