గుంటూరు: నెహ్రూ నగర్లోని సెయింట్ లూక్స్ స్కూల్కు జిల్లా ఇన్ఛార్జి డీఈవో యేసురత్నం గురువారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. విద్యార్థులను కారణం లేకుండా ఎండలో నిలబెట్టి, బ్యాగులు మోయిస్తున్నారన్న ఫిర్యాదులపై ఆయన స్పందించారు. ఈ అమానుష చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.