WG: జిల్లా ముఖ్య ప్రణాళికా శాఖ సహాయ సంచాలకులు కంటిపూడి శ్రీనివాసరావుకు డిప్యూటీ డైరెక్టర్గా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఏప్రిల్ 2022 నుంచి భీమవరంలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన, గతంలో రెండుసార్లు ఇంఛార్జ్ సీపీఓగా అదనపు బాధ్యతలు చేపట్టారు. పదోన్నతి పొందిన శ్రీనివాసరావు త్వరలోనే ఏలూరు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.