KRNL: పెద్దకడబూరు మండలంలో దళితులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో దళితులకు రక్షణ కల్పించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు ఆశీర్వాదం, సుమల రాజేష్ డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దకడబూరు పోలీసు స్టేషన్లో ఎస్సై నిరంజన్ రెడ్డికు వినతి అందజేశారు. ఇటీవల చోటుచేసుకున్న ఘటనలను ఖండిస్తూ, ప్రాణహాని ముప్పు ఉన్న నాయకులకు తగిన రక్షణ కల్పించాలని కోరారు.